ఓ వీరజవాను ఫోన్.. కొనవూపిరితో ఉండీ భార్యకు ధైర్యం చెప్పి...

Posted By:
Subscribe to Oneindia Telugu

కశ్మీర్‌: భారత సైన్యంలో పనిచేస్తున్న తన భర్త నిండునూరేళ్లు బతకాలని కర్వా చౌత్‌ పర్వదినాన ఉపవాసం చేసింది ఓ జవాన్ భార్య. కానీ ఆమె ఉపవాసం విడవకముందే అమరుడయ్యాడు ఆమె భర్త.

ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్నప్పటికీ భార్యకు ఫోన్‌ చేసి 'నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. మళ్లీ ఉదయం మాట్లాడతా..' అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు.

In his last moment, An Army Jawan Phone Call to his Wife..

ఈ బాధాకర ఘటన ఉత్తర కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కంగ్ర ప్రాంతానికి చెందిన సుబేదార్‌ కుమార్‌ బడ్గాం జిల్లాలో ఆర్మీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం కర్వా చౌత్‌ పండుగను పురస్కరించుకుని కుమార్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని అతడి భార్య దేవి ఉపవాసం చేసింది.

దురదృష్టవశాత్తు అదే రోజు సాయంత్రం ఉగ్రమూకల కాల్పుల్లో కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆఖరి సారిగా భార్య దేవితో మాట్లాడాలని కుమార్ ఆమెకు ఫోన్‌ చేశాడు.

తన కోసం దేవి ఉపవాసం చేస్తోందని తెలిసి 'నువ్విక భోజనం చేసెయ్‌. నేను డ్యూటీకి వెళుతున్నాను.. మళ్లీ ఉదయం మాట్లాడతా..' అని చెప్పాడు. ఆ మర్నాడే అతడి పై అధికారుల నుంచి దేవికి ఫోన్ వచ్చింది.

కుమార్‌ ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు వారు చెప్పడంతో.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక దేవి కన్నీరుమున్నీరయింది. వీర జవాన్ కుమార్‌ భౌతికకాయానికి మంగళవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In his last moment, an Army jawan Subedar Kumar called his wife over phone and told her " Break your fasting and eat something, I am going to duty, I will call you tomorrow..". Kumar is working in Indian Army at Badgam District and he shot in recent Naxals firing. Before dying he wanted to talk to his wife and make a call to her. He knows that on the occassion of Karwa Chauth.. his wife Devi is on fasting. On the next day a message came from Indian Army Officials that Kumar was dead in a exchange of firing. After hearing the news his wife Devi collapsed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి