రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం

రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది . రాజస్తాన్ లో ఏప్రిల్ 29 మరియు మే 6 న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఈ దఫా రాజస్థాన్ లో ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ చాలా ప్రయత్నం చేసింది. నాల్గవ మరియు ఐదవ దశలలో 25 సీట్లలో పోలింగ్ జరిగింది.

రాజస్థాన్ రాష్ట్రంలో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 255 కాగా ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్ ల మధ్యే పోరు సాగింది. రాజస్థాన్ లో నియోజకవర్గాలు టోంక్-సవై మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్పూర్, బార్మర్, జౌలార్, ఉదయపూర్, బన్స్వారా, భిల్వారా, కోట, ఝలావర్-బరన్, గంగానగర్, బికానెర్, చురు, ఝుంఝును, సికర్, జైపూర్ రూరల్, జైపూర్ , అల్వార్, భరత్పూర్, కరౌలి-ధోల్పూర్, దౌసా మరియు నాగౌర్ లలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సాగుతుంది. రాజస్థాన్ లోక్సభ ఎన్నికల ఫలితాలలో మరోమారు బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది.

in Rajasthan.. BJP leads in 24 of 25 seats, reversing the last assembly polls debacle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+