Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్కీలకు శుభవార్త: ఇండియన్ ఐటీ నిపుణులకు ఉద్యోగాలు

టెక్కీలకు శుభవార్తను అందించాయి భారతీయ టెక్ దిగ్గజ కంపెనీలు. మైక్రోసాఫ్ట్, లింక్ట్ ఇన్, ఓరాకిల్, ఫేస్ బుక్, గూగుల్ ఇండియా లాంటి టెక్ మేజర్లు భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణులను నియమించుకొనున్నాయి.

న్యూఢిల్లీ: టెక్కీలకు శుభవార్తను అందించాయి భారతీయ టెక్ దిగ్గజ కంపెనీలు. మైక్రోసాఫ్ట్, లింక్ట్ ఇన్, ఓరాకిల్, ఫేస్ బుక్, గూగుల్ ఇండియా లాంటి టెక్ మేజర్లు భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణులను నియమించుకొనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత సాఫ్ట్ వేర్ రంగంపై ఈ ప్రభావం అధికంగా కన్పిస్తోంది.

ప్రధానంగా ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలపై ఈ ప్రభావం అధికంగా కన్పిస్తోంది.సాఫ్ట్ వేర్ రంగం మందగమనంలో ఉంది.దీంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకొనే పనిలో పడ్డాయి.

కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకొనేపనిలో పడ్డాయి.ఉద్యోగులకు పింక్ స్లిప్ లను ఇస్తున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఉద్యోగం పోతోందనే ఆందోళన మొదలైంది.దీంతో సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు యూనియన్లు ఏర్పాటుచేసుకొనే అనివార్య పరిస్థితులు కూడ నెలకొన్నాయి.

ఇండియన్ ఐటీ నిపుణులకు ఉద్యోగాలు

ఇండియన్ ఐటీ నిపుణులకు ఉద్యోగాలు

దేశీయ ఐటీ కంపెనీలు , దేశీయ టెక్కీలకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకొంటున్న సందర్భంలో దిగ్గజ కంపెనీలకు భారతీయ టెక్కీలకు తీపికబురు అందించాయి. తాజాగా నివేదికల ప్రకారంగా మైక్రోసాఫ్ట్, లింక్డ్ ఇన్, ఒరాకిల్, ఫేస్ బుక్, గూగుల్ లు ఇండియా లాంటి టెక్ మేజర్లు భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణులను నియమించుకోనున్నాయి.తద్వారా భారతీయ సమాచార సాంకేతిక సర్వీసు ప్రోవైడర్లతో టాలెంట్ వార్ దిగాయని ఓ రిపోర్ట్ వెల్లడించింది.అమెరికా ఆధారిత సంస్థలు తమ స్వంత మార్కెట్ లో అభద్రత పెరుగుతున్నప్పటికీ, ప్రపంచ ప్రత్యర్థితో పోటీ కారణంగా ఇండియన్ ఐటీ నిపుణులను ఎంచుకొంటున్నాయి.

భారత్ లో నాలుగు నెలల్లో ఉద్యోగులను రెట్టింపు చేశాయి

భారత్ లో నాలుగు నెలల్లో ఉద్యోగులను రెట్టింపు చేశాయి

ఫేస్ బుక్, లింక్డ్ ఇన్ తదితర కంపెనీలు కొన్ని గత నాలుగు నెలల్లో భారత్ లో తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపును చేశాయి.భారత్ లో ప్రపంచ అంతర్గత కేంద్రాలు భారత టెక్కీల ఉద్యోగాల కల్పనలో పెద్ద పాత్ర పోషిస్తాయని బైన్ అండ్ కంపెనీ ఇటీవల ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. భారతీయ జిఐసిలు తదుపరి మూడు నుండి ఐదేళ్ళలో ప్రపంచ సి స్థాయి అధికారుల ఫార్చ్యూన్ వెయ్యి కంపెనీల్లో చోటు సంపాదించుకొంటుకొంటాయి. అగ్రశ్రేణి పెట్టుబడి ప్రాధాన్యతలను మరింత చురుకైన పాత్రను పోషిస్తాయని నివేదించింది.

డిజిటల్ టెక్నాలజీలో ఇండియా ఆదర్శం

డిజిటల్ టెక్నాలజీలో ఇండియా ఆదర్శం


డిజిటల్ టెక్నాలజీలో భారత్ ప్రయోగాత్మక ప్రదేశంగా ఉందని, మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ , పరిశోధనా సంస్థ , మేనేజ్ మెంట్ మేనేజర్ ఆనంద్ సుబ్రమణ్యం చెప్పారు.ఈ సంస్థల భారతీయ డెలివరీ కేంద్రాలు ప్రపంచ వనరులతో సమానంగా ఉన్నాయన్నారు. వారు పోటీని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
అంతర్జాతీయ సంస్థలకు చెందిన భారత్ కేంద్రాలు తమ పేరేంట్ సంస్థల కొత్త సామర్థ్యాలను ఏర్పరచుకొనేందుకు టెక్నాలజీని సమర్థతను పెంచుకొనేందుకు కృషిచేస్తున్నాయన్నారు సుబ్రమణ్యం.

పలు విభాగాల్లో నియామకాలు

పలు విభాగాల్లో నియామకాలు

ఈ కామర్స్, డిజిటల్ టెక్నాలజీ రిటైల్, సప్లయ్ ఛైన్ సాంకేతిక టెక్నాలజీ , కోర్ ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లలో నెట్ వర్కింగ్ , వర్కింగ్ , వర్చ్యువల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంటైనర్సిజేషన్, విశ్లేషణలు, బిగ్ డేటా ప్రాజెక్టు మేనేజ్ మెంట్ వంటి విభాగాల్లో నియామకాలను చేపట్టినట్టు లాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ బ్రాండ్ తెలిపారు. భారత్ లో వెయ్యిమంది ఉద్యోగులతో ఉన్న సంస్థ తమ ఐటీ మరియు విశ్లేషణ సామర్థ్యాలను వృద్ది వ్యూహాన్ని పెంచుకొనున్నట్టు తెలిపింది.

2500 ఉద్యోగాలు

2500 ఉద్యోగాలు

టార్గెట్ , లోన్స్ వంటి ఇతర అమెరికా ఆధారిత సంస్థలు మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా విశ్లేషణ, నెట్ వర్కింగ్ వంటి రంగాల్లో భారతదేశంలో ఇంజనీర్లను నియమించుకొంటున్నాయి. భారతదేశంలో రెండువేల ఐదువందల మంది ఉద్యోగులను కలిగి ఉన్న టార్గెట్ ఇండియా టెక్నాలజీ , మార్కెటింగ్ సరఫరా ఛెయిన్, యానిమేషన్ వంటి నిపుణులను నియమించుకోనుంది.

యానిమేషన్, ఇమేజరీలో ప్రతిభ ఉంటే చాలు

యానిమేషన్, ఇమేజరీలో ప్రతిభ ఉంటే చాలు


జావా,ఓపెన్ సోర్స్ సామర్థ్యాలతో మెషిన్ లెర్నింగ్ , న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో నైపుణ్యం కలిగినవారిని తాము ఎంపిక చేయనున్నట్టు టార్గెట్ ఇండియాలో హెచ్ఆర్ హెచ్ షాలిని నటరాజ్ తెలిపారు. టెక్నాలజీకి అదనంగా కంప్యూటర్లో రూపొందించబడిన ఇమేజరీ అండ్ యానిమేషన్లో భారతదేశం ప్రతిభను కలిగి ఉందన్నారు. తమ మార్కెటింగ్ బృందం సీజీఐ సామర్థ్యాలను విస్తరించనుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+