వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడి లారీలు అక్కడే: సమస్యల పరిష్కారం పట్టని సర్కార్.. సరుకుల ధరలు పెరిగే చాన్స్

ఎక్కడి లారీలు అక్కడే: సమస్యల పరిష్కారం పట్టని సర్కార్.. సరుకుల ధరలు పెరిగే చాన్స్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: రాష్ట్రంలో లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అత్యవసర సరుకులు మినహా అన్ని రకాల సరుకుల రవాణా దాదాపుగా ఆగిపోయింది. జాతీయ స్థాయి డిమాండ్లతోపాటు రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని గురువారం ఉదయం ఆరు గంటల నుంచే లారీ యజమానులు సమ్మె ప్రారంభించారు. తెలంగాణ లారీ యజమానుల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినా అవి కొలిక్కి రాలేదు. ఉన్నఫళంగా డిమాండ్ల పరిష్కారం సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం.. వాటి పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ దీనికి లారీ యజమానుల సంఘం అంగీకరించలేదు. ఫలితంగా చర్చలు విఫలం కావటంతో.. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం ఉదయం ఆరు గంటలకు లారీ యజమానులు సమ్మెకు దిగారు.

దాదాపు లక్షన్నర లారీలు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,50 లక్షల లారీలు ఆగిపోయాయి. పలు మార్కెట్లకు సరుకు రవాణా నిలిచిపోయింది. హైదరాబాద్‌లోని మూసాపేట్, మియాపూర్, పటాన్‌ చెరు, వనస్థలిపురం, ఆటోనగర్‌ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో వేల సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు లారీల రాకపోకలు ఆగిపోయాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సరఫరా అయ్యే ఇసుక రవాణా కూడా చాలా వరకు నిలిచిపోయింది.

Indefinite strike: lorries to stay off roads

ముందు బుక్ చేసిన లారీలు మాత్రమే రోడ్డెక్కాయి
బుధవారం ఉగాది సెలవు రోజు కావటం, ముందే సరుకు రవాణా బుక్‌ చేసుకుని ఉండటంతో కొన్ని లారీలు మాత్రం రోడ్డెక్కాయి. అవి కూడా శుక్రవారం నిలిచిపోతాయని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరెడ్డి ప్రకటించారు. పాలు, మందులు, కూరగాయలు, చమురు, నీటి ట్యాంకర్లను తాత్కాలికంగా సమ్మె నుంచి మినహాయించామని... ఆదివారం నాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే వాటిని కూడా సమ్మెలోకి తెస్తామని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాలకు సింగిల్ పర్మిట్ అమలు చేయాలన్న డిమాండ్

తెలుగు రాష్ట్రాలకు వర్తించేలా సింగిల్‌ పర్మిట్‌ను అమలు చేయాలని, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో, పుదుచ్ఛేరిలో సమ్మె కొనసాగుతున్నది. దాంతో కొందరు ముందస్తు రవాణా ఒప్పందాలు కుదుర్చుకున్నా కూడా.. ఇతర లారీల నిర్వాహకులు అడ్డుకునే అవకాశం ఉండటంతో లారీలు నడపడం లేదు. ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. గురువారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని.. దీంతో శుక్రవారం నుంచి సమ్మెను తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్టు లారీల యజమానుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు.

నేటి నుంచి లారీ డ్రైవర్ల వంటావార్పు ఆందోళన
శుక్రవారం నుంచి వంటావార్పు కార్యక్రమాలు, నిరసనలు చేపట్టనున్నట్లు లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం వరకు ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. సోమవారం నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం ధాన్యం సరఫరా సీజన్‌ కావటంతో.. లారీల సమ్మె విషయంలో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆర్టీఏ ప్రత్యేక సెల్‌
లారీల సమ్మె నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు రవాణా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. మార్కెటింగ్, పౌర సరఫరాల విభాగాలకు అవసరమైన వాహనాలను అందజేసేందుకు, సరుకు రవా ణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ కేంద్రంగా 9848528460 నంబర్‌తో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అన్ని చోట్లా నిత్యా వసరాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వారం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని హైదరాబాద్‌ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ తెలిపారు.

ఇవీ డిమాండ్లు
15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్డు మీదకు అనుమతించాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. టోల్ ప్లాజాలను ఎత్తివేసి తమకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. తమ వద్ద టోల్ ఫీజు పేరుతో వసూలు చేసిన మొత్తంతో రోడ్డు నిర్వహణకు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ఫీజు తగ్గించాలని, ఆర్టీవో కార్యాలయాల వద్ద ఫీజు తగ్గింపు తదితర డిమాండ్లు లారీ డ్రైవర్లు చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే 4.25 లక్షల లారీలు, ఐదు లక్షల మినీ వాహనాలు తమిళనాడు అంతటా తిరుగుతున్నాయి.

English summary
Even though the Centre has accepted to consider the major demands of the South India Motor Transport Association (SIMTA) during the talks held in New Delhi on Tuesday, the association has stuck to its stand of launching an indefinite strike from Thursday (March 30), as the Tamil Nadu government remains tight-lipped about the demands concerning it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X