Independence Day 2026: ఈసారి జరుపుకునేది 79వదా? 80వదా?

భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వేడుకల సందడి మొదలైపోయింది. దేశప్రజలందరిలోనూ దేశభక్తి ఉప్పొంగే ఈ మహత్తర ఘట్టం కోసం ఎర్రకోట సిద్ధమవుతోంది. 200 ఏళ్లకు పైగా సాగిన బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజును గుర్తుచేసుకుంటూ, కోట్ల మంది భారతీయులు ఈ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు.

అయితే ప్రతి ఏటా వలే ఈసారి కూడా చాలామందికి ఒక పెద్ద అనుమానం మొదలైంది. అదేమిటంటే.. ఈసారి మనం జరుపుకోబోయేది 79వ స్వాతంత్ర్య దినోత్సవమా? లేక 80వదా? దీనికి సంబంధించిన అసలు నిజం, ఈసారి జరగబోయే ప్రత్యేక కార్యక్రమాల విశేషాలు ఇవే!

Independence Day 2026 Celebration Know If India Is Celebrating 79th Or 80th Independence Day This Year

79 కాదు.. ఇది కచ్చితంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవమే!

చాలామంది ప్రతి సంవత్సరం కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఇది. 2026 సంవత్సరంలో నుంచి స్వాతంత్ర్య సంవత్సరం 1947 తీసేస్తే 79 వస్తుంది కదా.. మరి 80వ దినోత్సవం ఎలా అవుతుందని కొందరు లెక్కలు వేస్తుంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరుగుతోంది. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే 'మొదటి' స్వాతంత్ర్య దినోత్సవం. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అక్కడి నుంచి.. నేటి వరకు లెక్కేస్తే, ఈ 2026 ఆగస్టు 15న మన భారతావని జరుపుకునేది సరిగ్గా 80వ స్వాతంత్ర్య దినోత్సవం అవుతుంది.

ఆగస్టు 15పై అమెరికా కీలక ప్రకటన! గవర్నర్ చారిత్రాత్మక నిర్ణయం
ఆగస్టు 15పై అమెరికా కీలక ప్రకటన! గవర్నర్ చారిత్రాత్మక నిర్ణయం

ఈ ఏడాది ప్రత్యేక థీమ్..

ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కన్సెప్ట్‌ను ఎంచుకుంది. 'వికసిత భారత్ @ 2047 సాధనలో యువశక్తి పాత్ర' అన్న ప్రధాన థీమ్ తో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అంతేకాదు, జాతీయ గేయం 'వందేమాతరం' రూపుదిద్దుకుని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి వేడుకల్లో దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకోగానే ముందుగా వందేమాతర గీతాలాపన జరుగుతుంది. ఆ తర్వాత ప్రధాని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.. ఆరు చరణాల 'వందేమాతరం’ మారుమోగింది
పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.. ఆరు చరణాల 'వందేమాతరం’ మారుమోగింది

ఎర్రకోటపై సంబరాలు.. త్రివిధ దళాల వందనం!

ఆగస్టు 15 ఉదయాన్నే ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద వేడుకలు అట్టహాసంగా ప్రారంభమవుతాయి. త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధానమంత్రి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ, 21 గన్ సెల్యూట్, జాతీయ గీతాలాపన ఉంటాయి. ఆకాశం నుంచి వాయిసేన హెలికాప్టర్లు పూలవాన కురిపించడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి వీధిలోనూ పంద్రాగస్టు వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు మిన్నుముట్టనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+