Loksabha Election 2024: ఏడు దశల్లో ఎన్నికలా.. ఇండియా కూటమి అసహనం..
లోక్‌సభ ఎన్నికలు ఏడు దశలలో జరపడంపై ప్రతిపక్షాలు శనివారం విమర్శలు గుప్పించాయి. సుదీర్ఘ షెడ్యూల్ తో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిచోటా పర్యటించాలనుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో వ్యాఖ్యానించారు. మూడు లేదా నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహించవచ్చని ఖర్గే చెప్పారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జూన్ 4 వరకు ప్రభుత్వ పనులు చాలా వరకు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
"దాదాపు 70-80 రోజుల పాటు అన్ని పనులను నిలిపివేస్తే, దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా బడ్జెట్ ఖర్చులు ఖర్చు చేలేము. కాబట్టి ఇది ప్రయోజనకరం కాదు. ఇది మూడు లేదా నాలుగు దశల్లో పూర్తయ్యేది" అని ఖర్గే అన్నారు. శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఖర్గే వ్యాఖ్యలను సమర్థించారు. సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్ ప్రజలలో అధికార పార్టీకి అనుకూలంగా ఉందన్నారు.

మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనుండగా, మోడీ పాలనలో అనేక కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని మరో పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు ఎందుకని ఎన్సీపీ నేత ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండానికి కారణం చెప్పాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదే సమయంలో ఎన్నికలను ఒకే దశ లేదా రెండు దశల్లో నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచనను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని నిలదీసింది.
"మేము రాష్ట్రంలో ఒకే లేదా జంట-దశల లోక్‌సభ ఎన్నికలను కోరుకుంటున్నాము. బహుళ దశల ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఖర్చును పెంచుతాయి. అధికార పార్టీకి ప్రయోజనాన్ని కలిగిస్తాయని మా అభిప్రాయం" అని బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య కోల్‌కతాలో చెప్పారు.కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ లో ఏడు దశల ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. శాంతియుత ఎన్నికల ప్రక్రియకు ఇది అవసమని అన్నారు.
ఏడు దశల్లో జరిగిన 2019 ఎన్నికల్లో మొదటి, చివరి దశల మధ్య విరామం 39 రోజులుగా ఉంది. 2024 ఎన్నికల్లో ఈ వ్యవధి ఇప్పుడు 44 రోజులకు పెరిగింది. ఐదేళ్ల క్రితం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కనీసం 75 రోజులు అమలులో ఉండగా, ఈసారి జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు వరకు 80 రోజుల పాటు అమలులో ఉంటుంది.1999లో మొదటి, చివరి దశల పోలింగ్ మధ్య గ్యాప్ 32 రోజులు కాగా, 2004లో 22 రోజులు, 2009లో 28 రోజులు, 2014లో 36 రోజులుగా ఉంది.












Click it and Unblock the Notifications