Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫీవర్, కోల్డ్‌కి వినియోగించే 156 కాంబినేషన్ డ్రగ్స్‌పై భారత్ నిషేధం

భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ (FDC) మందులను.. 'మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది' అని పేర్కొంటూ కేంద్రం నిషేధించింది. ఎఫ్‌డీసీ ఔషధాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్ధాల కలయికను స్థిర నిష్పత్తిలో కలిగి ఉంచడం. వీటిని "కాక్‌టెయిల్" మందులుగా కూడా పేర్కొంటారు.

నిపుణుల కమిటీ, అపెక్స్ ప్యానెల్, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB).. యాంటీ బాక్టీరియల్ ఔషధాలతో సహా ఈ కలయికలు చికిత్సాపరమైన సమర్థనను కలిగి ఉండవని, మానవ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని కనుగొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

India bans 156 combination drugs used for fever and cold allergies

ఆగస్ట్ 12న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ + పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్', మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెటిరిజైన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్ + ఫినైల్‌ఫ్రైన్ హెచ్‌సిఎల్, లెవోసిలిప్రైన్ + ప్లోసెటిరిజైన్ + పారాసెటమాల్ + క్లోర్ఫెనిరమైన్ మలేట్ + ఫినైల్ ప్రొపనోలమైన్, కామిలోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ 25 ఎంజీ + పారాసెటమాల్ 300ఎంజీ వంటి ప్రముఖ కాంబినేషన్‌లు ఉన్నాయి.

అంతేగాక, పారాసెటమాల్, ట్రామడాల్, టౌరిన్, కెఫిన్ కలయిక కూడా నిషేధించారు. ఎందుకంటే ఇది ట్రామడాల్ ఓపియాయిడ్ ఆధారిత నొప్పి నివారిణి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26A కింద నిషేధం జారీ చేశారు. హానికరం లేదా అనవసరమైనదిగా భావించే ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీని నిషేధించడానికి ఇది ప్రభుత్వానికి అనుమతిస్తుంది.

ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్‌ని ఉపయోగించడం వల్ల మనుషులకు ప్రమాదం పొంచి ఉందని, అయితే ఈ డ్రగ్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెందిందని నోటిఫికేషన్ పేర్కొంది. ఈ ఎఫ్‌డిసిలను "అహేతుకం"గా పరిగణించిన కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ ఈ విషయాన్ని పరిశీలించిందని తెలిపింది. రోగుల సురక్షితం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

'ఎఫ్‌డీసీ మానవులకు ప్రమాదం కలిగించవచ్చు. అందువల్ల, భారీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26 A ప్రకారం ఈ FDC తయారీ, అమ్మకం లేదా పంపిణీని నిషేధించడం అవసరం" అని నోటిఫికేషన్ పేర్కొంది. పైన ఉన్న దృష్ట్యా, రోగులలో ఏదైనా ఉపయోగం కోసం అనుమతించే ఎలాంటి నియంత్రణ లేదా పరిమితి సమర్థనీయం కాదు. కాబట్టి, సెక్షన్ 26A కింద నిషేధం మాత్రమే సిఫార్సు చేయబడింది" అని స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+