పాకిస్తాన్ పై కేంద్రం భగ్గు

పాకిస్తాన్ ఘాతుకానికి తెగబడింది. పొరుగుదేశం అఫ్ఘానిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆ దేశ భూభాగంపై మెరుపుదాడులు చేసింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ ఘటనలు 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడులను అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించాయి. సరిహద్దుల వెంబడి ఏడుచోట్ల వైమానిక దాడులు చోటు చేసుకున్నట్లు నిర్ధారించాయి.

కొద్దిరోజుల కిందట పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఓ మసీదుపై ఆత్మాహూతి దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి ఆఫ్ఘనిస్తాన్, భారత్ ప్రధాన కారణమంటూ ఆరోపిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత్ ఈ దాడులకు ప్రణాళికలు రచించిందని, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ అమలు చేసిందనీ చెబుతోంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ పై తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది పాకిస్తాన్. ఈ దాడులు పక్తికా ప్రావిన్స్‌తో పాటు సరిహద్దు వెంబడి ఉన్న ఖోస్ట్, పక్తియా, నంగర్‌హర్ వంటి ఇతర ప్రావిన్స్‌లలో టీటీపీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

India Condemns Pakistan Airstrikes in Afghanistan Amid Civilian Casualties During Holy Ramadan Month

పాకిస్తాన్ జరిపిన ఈ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రాలకు భారత్ మద్దతు ప్రకటించింది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటి ప్రపంచానికి చూపించే ప్రయత్నమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రంజాన్ మాసంలో అఫ్గాన్ భూభాగంలో పాకిస్తాన్ వైమానిక దాడులు జరపడం, అందులో మహిళలు, పిల్లలతో సహా పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం దీన్ని ఖండించాలని కోరింది. వైమానిక దాడుల్లో అమాయకులు మరణించడం ఆందోళనకరమని, పాకిస్తాన్ చర్యలు ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తోన్నాయని అన్నారు.

అటు ఆఫ్ఘనిస్తాన్ ఈ దాడుల పట్ల భగ్గుమంటోంది. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకతప్పదనీ హెచ్చరించింది. పక్తికా, నంగర్‌హార్ ప్రావిన్సుల్లో జరిగిన దాడులకు అవసరమైన, తగిన ప్రతీకారం ఉంటుందని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దేశ సరిహద్దులను, పౌరులను రక్షించడం తమ జాతీయ కర్తవ్యంగా అభివర్ణించింది. సరిహద్దు ఉల్లంఘనలు కొనసాగితే మౌనంగా ఉండదనీ తేల్చి చెప్పింది.

ఈ దాడులు పాకిస్తాన్ గూఢచార వైఫల్యాలకు నిదర్శనమని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. తమ దేశ గడ్డ నుండి పనిచేస్తున్న పాకిస్తాన్‌ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులపై కాబూల్ చర్యలు తీసుకోవడం లేదని ఇస్లామాబాద్ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారుల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+