వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: కరోనా 12, గుజరాత్ మహిళా కన్నుమూత, 600 పైచిలుకు పాజిటివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే 11 మంది చనిపోగా.. బుధవారం మరొకరు చనిపోయారు. గుజరాత్‌కు చెందిన వృద్ధురాలు మృతిచెందారు. ఆమె ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చారు. తర్వాత వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వైరస్ పాజిటివ్ రావడంతో వైద్యులు చికిత్స అందజేశారు. అయితే వృద్ధురాలు వయస్సు 85 ఏళ్లు.. కరోనా వైరస్ సహా.. ఆమెకు పలు వ్యాధులు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటున్నందున వైరస్ బారినపడి చనిపోతున్నారు. దేశంలో చనిపోయిన వారంతా దాదాపుగా వృద్ధులే కావడం గమనార్హం. గుజరాత్‌కు చెందిన వృద్ధురాలు వయస్సు ఎక్కువగా ఉండటం, ఇతర అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.

 తమిళనాడులో ఒకరు

తమిళనాడులో ఒకరు

తమిళనాడులో కరోనా వైరస్ సోకిన 54 ఏళ్ల ఓ వ్యక్తి మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో మొదటి కరోనా మృతి కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 11కి చేరింది. తాజా కరోనా మృతి కేసును తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ధ్రువీకరించారు. మృతుడు స్టెరాయిడ్స్ వాడుతున్నట్టుగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 ముంబైలో ఇద్దరు..

ముంబైలో ఇద్దరు..

ముంబైలో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరగా, దేశవ్యాప్తంగా 10కి చేరింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి సోమవారం ముంబైలో చనిపోయారు. అతని కిడ్నీ పనిచేయక చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు చనిపోయారు. 69 ఏళ్ల వృద్దుడు వైరస్ సోకి చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఇతని మృతితో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకున్నది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఇది బెంగాల్‌లో మొదటి కరోనా మరణం అని అధికారులు పేర్కొన్నారు. ఇటలీ నుంచి కుటుంబంతో సహా కోల్‌కతా రాగా.. అతని కుమారుడు మాత్రం బాగానే ఉన్నారు.

 పాట్నాలో ఒకరు

పాట్నాలో ఒకరు

పాట్నాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఖతార్ నుంచి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో చికిత్స తీసుకుంటున్నారు. పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. మృతిచెందాక కూడా అతని రక్త నమూనాలు సేకరించిన వైద్యులు.. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. కర్ణాటక, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లో ఒక్కొక్కరు కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడు మృతిచెందారు. ఇటలీ టూరిస్ట్ మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పుణెలో ఒకరు చనిపోవడంతో అది ఆరుకి చేరింది.

English summary
India confirms 12th death of coronavirus, 85-year-old Gujarat woman dies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X