పెద్ద నోట్లకు మరో దెబ్బ: చావుకబురు చల్లగా !
న్యూఢిల్లీ: గంటల కొద్ది బ్యాంకుల ముందు క్యూలో నిల్చుంటున్న సామాన్య ప్రజలకు మరో ఆరు వారాలు ఇలాంటి సమస్యలు తప్పవని బ్యాంకు యాజమాన్యాలు తెలిపాయి. రెండు వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఉన్న పరిస్థితి వచ్చే రెండు వారాల తరువాత ఉండదని, పరిస్థితి సాధారణ స్థితికి తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే రెండు వారాల్లో కుదరదని, కనీసం ఆరు వారాలు అవసరం అవుతుందని బ్యాంకు యాజమాన్యాలు చావుకబురు చల్లగా చెప్పాయి. దేశ వ్యాప్తంగా కొత్తనోట్లు ప్రవేశపెడుతున్నందున అన్ని ఏటీఎం కేంద్రాల్లో సరికొత్త టెక్నాలజీ వినియోగించాల్సి వస్తుందని అన్నారు.

ప్రతి ఏటీఎం కేంద్రంలో ఈ సరికొత్త టెక్నాలజీ అప్ డేట్ చెయ్యడానికి కనీసం 15 నిమిషాలు పడుతుందని చెప్పారు. సరికొత్త టెక్నాలజీ అప్ డేట్ చేసే ఇంజనీర్లు ఇప్పుడు మూడు వేల మందే ఉన్నారని గుర్తు చేశారు.
అయితే దేశంలో 2,02,000 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయని, అన్ని ఏటీఎంల్లో సరికొత్త టెక్నాలజీ అప్ డేట్ చెయ్యడానికి ఆరువారాలు పడుతుందని వారు వివరించారు. అందువలన అన్ని ఏటీఎంల్లో టెక్నాలజీ అప్ డేట్ చెయ్యడానికి ఇంకా వెయ్యి మందికి పైగా ఇంజనీర్లు అవసరం ఉంటుందని బ్యాంకు యాజమాన్యాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications