చేతులు కట్టుకుని కూర్చుంటామా? పహల్గాం ఉగ్రదాడిపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు!
దేశ భద్రత, విదేశాంగ విధానం, స్వీయ రక్షణ సిద్ధాంతాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడూ తన పొరుగు దేశాలకు అపాయం తలపెట్టదని, శాంతిని కోరుకునే దేశమని స్పష్టం చేసిన ఆయన, ఒకవేళ ఎవరైనా దుస్సాహసానికి పాల్పడినా, శత్రువులుగా మారినా మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిదిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోహన్ భగవత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం లో ఉగ్రదాడిపై నేపథ్యంలో శత్రులకు గట్టి హెచ్చరి ఇచ్చారు. ప్రస్తుత దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మోహన్ భగవత్ మాట్లాడుతూ, భారతదేశం సహనానికి, శాంతియుత సహజీవనానికి ప్రతీక అని, ఎప్పుడూ కూడా తన పొరుగు దేశాల విషయంలో కయ్యానికి కాలు దువ్వలేదని, ఎవరికీ హాని చేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఇది భారతదేశపు వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, నాగరికత నేర్పిన పాఠమని అన్నారు. అయితే, మన ఈ శాంతి కాముకతను బలహీనతగానో, పిరికితనంగానో భావించి ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే, మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తే, లేక దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా శత్రుత్వం వహిస్తే మాత్రం భారత దేశం చేతులు కట్టుకుని కూర్చోదని ఆయన హెచ్చరించారు. అటువంటి శత్రువులకు దీటుగా, గట్టిగా, కఠినంగా బదులిస్తామని, వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అవసరమైతే వదిలిపెట్టేది లేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శత్రువులను క్షమించడం లేదా వదిలిపెట్టడం భారతదేశ సంప్రదాయం కాదని ఆయన పరోక్షంగా తన ప్రసంగంలో పేర్కొన్నారు.
శత్రువుల చేతిలో ఓడిపోకుండా తమను తాము రక్షించుకోవడం కూడా మన విధిలో భాగమేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. ఇది కేవలం ఒక రాజకీయపరమైన నిర్ణయం లేదా సైనిక వ్యూహం మాత్రమే కాదని, సనాతన హిందూ ధర్మంలో పొందుపరచబడిన ఒక అత్యంత ముఖ్యమైన నియమని ఆయన ఉద్ఘాటించారు. ధర్మం అంటే కేవలం దైవారాధన, ఆచార వ్యవహారాలు మాత్రమే కాదని, తనను తాను, తన సమాజాన్ని, తన దేశాన్ని రక్షించుకోవడం, అన్యాయాన్ని, దాడిని ప్రతిఘటించడం కూడా ధర్మ పరిధిలోకి వస్తుందని ఆయన వివరించారు. తమపై దాడి జరిగితే ప్రతిఘటించడం, శత్రువును తిప్పికొట్టడం అనేది ఒక అనివార్యమైన, తప్పనిసరి అయిన కర్తవ్యమని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా సూచించారు.
సనాతన ధర్మానికి ఉన్న విశిష్టమైన లక్షణాలను వివరిస్తూ, ఇందులోని ఆచరణ పద్ధతులు, నియమాలు చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి, స్వీకరించడానికి అనువుగా ఉంటాయని మోహన్ భగవత్ అన్నారు. ముఖ్యంగా అహింస వంటి ఉన్నతమైన సూత్రాలు మానవులను లోతుగా ఆలోచింపజేస్తాయని, వారి అంతరాత్మను తట్టిలేపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ ధర్మ స్ఫూర్తితో ప్రభావితమై, దీనిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని తెలిపారు.
అయితే, సనాతన ధర్మ సూత్రాలు, ఆచరణ అందరికీ నచ్చకపోవచ్చని, కొందరు వ్యక్తులు లేదా సమూహాలు కావాలని దురుద్దేశంతో ఇబ్బందులు సృష్టించవచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, వారి నుంచి సమర్థంగా తమను తాము రక్షించుకోవడం, అవసరమైతే వారిని ధైర్యంగా ఎదుర్కోవడం కూడా సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరి కర్తవ్యమేనని భగవత్ నొక్కి చెప్పారు.
ప్రజలందరి రక్షణ, భద్రత విషయంలో రాజు (రాజ్యం లేదా ప్రభుత్వం) తన రాజధర్మాన్ని, అనగా ప్రజలను రక్షించే కర్తవ్యాన్ని తప్పకుండా, నిబద్ధతతో నిర్వర్తించాలని, ఇది పాలకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన విధి అని ఆయన గట్టిగా ఉద్ఘాటించారు. బలమైన, సురక్షితమైన రక్షణ కవచం ఉన్నప్పుడే దేశ ప్రజలు నిర్భయంగా, శాంతియుతంగా తమ జీవితాలను గడపగలరని ఆయన పరోక్షంగా సూచించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications