2024 కల్లా చైనాను దాటనున్న భారత్ జనాభా, ఆ తర్వాత..
2024 నాటికి భారత జనాభా చైనాను మించిపోతుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ఐరాస 'ప్రపంచ జనాభా భావి అంచనాలు: 2017 సవరణ' పేరుతో ఓ నివేదికను వెలువరించింది.
న్యూఢిల్లీ: 2024 నాటికి భారత జనాభా చైనాను మించిపోతుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ఐరాస 'ప్రపంచ జనాభా భావి అంచనాలు: 2017 సవరణ' పేరుతో ఓ నివేదికను వెలువరించింది.
2030 నాటికి భారత జనాభా 150 కోట్లకు చేరుతుందని అంచనా. చైనా ప్రస్తుత జనాభా 141 కోట్లు. భారత ప్రస్తుత జనాభా 134 కోట్లుగా ఉంది. ఏడేళ్లలో చైనా జనాభాను మించుతామని పేర్కొంది.

ప్రపంచ జనాభాలో ఇప్పుడు చైనా జనాభా శాతం 19గా, భారత్ జనాభా శాతం 18గా ఉంది. అంతకుముందు 2015లో ఐరాస అంచనా ప్రకారం.. చైనా జనాభాను భారత్ 2022 కల్లా అధిగమిస్తోందని పేర్కొంది.
2015లో 24వ ఐక్య రాజ్య సమితి అధికారుల పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్ భేటీ అయినప్పుడు 2022 కల్లా భారత్.. చైనాను అధిగమిస్తుందని పేర్కొంది. ఇప్పుడు 25వ రౌండ్ సమావేశంలో 2024 వరకు దాటుతుందని పేర్కొంది.
జనాభా అంచనాకు సంబంధించిన వివరాలను బుధవారం నాడు విడుదల చేశారు. దీని ప్రకారం 2024 కల్లా భారత్, చైనా దేశాల జనాభా 1.44 బిలియన్లుగా ఉంటుంది. అప్పటికే చైనా జనాభాను మించుతుంది. అనంతరం 2030 కల్లా 150 కోట్లకు చేరుకుంటుంది.
2050లో 166 కోట్లుగా భారత్ జనాభా ఉంటుందని తెలిపింది. అదే సమయంలో చైనా జనాభా 2024 వరకు కూడా దాదాపు అంతే ఉంటుందని అంచనా వేశారు.
ఆ తర్వాత 2100 కల్లా భారత్ జనాభా 151 కోట్లకు చేరుకుంటుందని ఐరాస అంచనా వేసింది. అంటే 2050 నుంచి 2100 వరకు అంటే అర్ధ శతాబ్దంలో భారత్ జనాభా తక్కువగానే పెరుగుతుంది. కానీ 2100 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ఉంటుంది.
ఈ రిపోర్టు ప్రకారం 2050 నాటికి నైజీరియా జనాభా అమెరికాను మించిపోనుంది. దీనితోపాటు నైజీరియా జనాభా విషయంలో ప్రపంచంలోనే మూడవ స్థానాన్నిఆక్రమించనుంది.
ఇక భారత్ విషయానికొస్తే 2050 నాటికి భారత్‌లో 60 సంవత్సరాల వయసు పైబడినవారి సంఖ్య రెండింతలవుతుందని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో 60 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య సుమారు 14 కోట్లు ఉంది. ప్రసుత భారత జనాభా 134 కోట్లు. చైనా జనాభా 141 కోట్లు ప్రతి ఏటా ప్రపంచ జనాభా 8.3 కోట్ల చొప్పున పెరుగుతున్నట్లు ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తుల కొరత ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.
2025-2030 మధ్య భారత దేశంలో సగటు వ్యక్తి జీవిత కాలం 71 ఏళ్లుగా, 2045-2050 మధ్య 74.2గా ఉంటుందని అంచనా వశారు.ప్రస్తుతం ప్రపంచ జనాభా 760 కోట్లుగా ఉంది. 2030 నాటికి 860 కోట్లు, 2050 నాటికి 980 కోట్లు, 2100 నాటికి 1120 కోట్లుగా ఉంటుందని అంచనా.
-
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications