మాల్దీవుల అధ్యక్షుడికి మోడీ ప్రమాణస్వీకార ఆహ్వానం-శత్రువుకూ స్నేహ హస్తం..!

భారత్-మాల్దీవుల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. గతంలో ప్రధాని మోడీపై మాల్దీవుల ఎంపీల చేసిన వ్యాఖ్యలు, అనంరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య గ్యాప్ పెరిగింది. అదే సమయంలో చైనా నుంచి స్నేహహస్తం అందడంతో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఆ దేశంలో పర్యటించారు. ఇది భారత్ తో గ్యాప్ మరింత పెరిగేలా చేసింది. అయినా ఈసారి ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి రావాలంటూ మాల్దీవుల అధ్యక్షుడికి మోడీ ఆహ్వనం పంపారు.

రేపు ఢిల్లీలో జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని మాల్దీవుల అధ్యక్షుడు మొయిజుకు ప్రధాని మోడీ ఆహ్వనం పంపారు. దీనికి ఆయన కూడా అంగీకరించి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మొయిజుకు ఇతర దేశాధినేతల తరహాలోనే ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. మాల్దీవులతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు కొంత క్షీణించినా తిరిగి వాటిని గాడినపెట్టేందుకు ప్రధాని మోడీ చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.

india plans grand welcome to Maldives president muizzu for pm modi s swearing in ceremony

గత ఏడాది నవంబర్‌లో ముయిజ్జూ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు క్షీణించాయి. తన ఎన్నికల ప్రచారంలో మొయిజు తరచుగా భారత్ పై విమర్శలు గుప్పించారు. తమ దేశం నుంచి భారత సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో భారత్ తన సైన్యాన్ని కూడా వెనక్కి పిలిపించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి మొయిజుకు ఆహ్వనం అందడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నానని, తనకు అందిన ఆహ్వానం పట్ల ప్రధాని మోదీకి ముయిజు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో సన్నిహిత సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధానితో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని, మాల్దీవులు-భారత్ సంబంధాలు సానుకూల దిశలో సాగుతున్నాయని, ఈ పర్యటన ద్వారా రుజువు అవుతుందని ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+