వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతిపితకు జిన్ పింగ్ నివాళి, వెంట భార్య (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గురువారం రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా బాపూఘాట్ చేరుకున్న ఆయన మాహాత్ముడి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

రాష్ట్రపతి ప్రణబ్వ ముఖర్జీ చైనా అధ్యక్షుడికి సాదరంగా ఆహ్వానించి కరచాలనం చేశారు. జిన్ పింగ్ రాష్ట్రపతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతా రెండు దేశాల మధ్య ప్రస్తుతం జరిగే చర్చలతో స్నేహబంధం మరింత బలపడుతుందన్నారు. చైనా - భారత్ దేశాల సాంస్కృతిక బంధానికి వేల ఏళ్ల చరిత్ర ఉందన్నారు.

ఆ తర్వాత జిన్ పింగ్ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధికారులు పాల్గోన్నారు.

జిన్ పింగ్ రెండో రోజు విశేషాలు

జిన్ పింగ్ రెండో రోజు విశేషాలు

ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమ ట్రస్టు చైనా అధ్యక్షుడికి ఎరవాడ జైలులో ఉన్నప్పుడు గాంధీజీ ఉపయోగించిన చరఖా ప్రతిరూపాన్ని, కొన్ని పుస్తకాలు, గాంధీ పెయింటింగ్ తదితర జ్ఞాపికలను కానుకగా ఇచ్చింది.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

మూడు రోజుల అధికార పర్యటనార్ధం భారత ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అపూర్వ స్వాగతం లభించింది.

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే ఇరు దేశాలను వ్యాపార, వాణిజ్యపరంగా సన్నిహితం చేస్తూ మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

బుధవారం కొద్దిసేపు మాత్రమే ముఖాముఖి సమావేశమైన మోదీ-జిన్‌పింగ్ గురువారం న్యూఢిల్లీలో శిఖరాగ్ర చర్చలు జరుపనున్నారు.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు


భారత్-చైనా మధ్య దీర్ఘ కాలం నుంచి నలుగుతున్న సరిహద్దు వివాదం సహా వివిధ అంశాలపై చర్చలు జరపడంతో పాటు ఉభయ దేశాల మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంపొందించుకోవాలన్న లక్ష్యంతో సతీసమేతంగా భారత్‌కు విచ్చేసిన జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీ 64వ జన్మదినోత్సవం నాడే తన పర్యటన ప్రారంభించడం విశేషం.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

గుజరాత్ నుంచి తన భారత దేశ పర్యటనను ప్రారంభించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బుధవారం మహాత్మాగాంధీ దంపతులు 12 ఏళ్లకు పైగా గడిపిన అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

సబర్మతి నది ఒడ్డున ఉన్న ఆశ్రమం గేటు వద్ద జీ జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి అనంది బెన్ పటేల్ స్వాగతం చెప్పారు.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు చైనా అధ్యక్షుడు అహ్మదాబాద్ చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తనకు బహూకరించిన ఆఫ్ వైట్ ఖాదీ జాకెట్ ధరించారు.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

మోదీ తమ గౌరవార్థం ఇచ్చిన విందులో చేరడానికి ముందు జిన్‌పింగ్ దంపతులు గుజరాత్ సంస్కృతిలో భాగమైన మంచంపై కూడా కూర్చున్నారు.

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి నూలుదండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమ ట్రస్టు చైనా అధ్యక్షుడికి ఎరవాడ జైలులో ఉన్నప్పుడు గాంధీజీ ఉపయోగించిన చరఖా ప్రతిరూపాన్ని, కొన్ని పుస్తకాలు, గాంధీ పెయింటింగ్ తదితర జ్ఞాపికలను కానుకగా ఇచ్చింది.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

అనంతరం చైనా అధ్యక్షుడు, సతీమణితో కలిసి సబర్మతి నది ఒడ్డున కొద్దిసేపు గడిపారు. మోదీ, జిన్‌పింగ్‌లు అక్కడ ‘ఝూలా' (ఉయ్యాల)లో కొద్దిసేపు కూర్చున్నారు.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

అనంతరం చైనా అధ్యక్షుడు, సతీమణితో కలిసి సబర్మతి నది ఒడ్డున కొద్దిసేపు గడిపారు. మోదీ, జిన్‌పింగ్‌లు అక్కడ ‘ఝూలా' (ఉయ్యాల)లో కొద్దిసేపు కూర్చున్నారు.

 జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

తాను ధరించిన తెల్లషర్టుపై జిన్‌పింగ్ ఈ జాకెట్ ధరించారు. మోదీ, జిన్‌పింగ్‌లు కొద్ది నిమిషాలు ఆశ్రమంలో గాంధీజీ వ్యక్తిగత గది ‘హృదయ్‌కుంజ్'లో గడిపారు. అక్కడ చైనా అధ్యక్షుడు చరఖా వడికారు.

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

ఆ తర్వాత జిన్ పింగ్ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధికారులు పాల్గోన్నారు.

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

ఆశ్రమంలో విజిటర్స్ బుక్‌లో జిన్‌పింగ్ చైనా భాషలో సంతకం చేశారు.

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

జిన్ పింగ్ మొదటి రోజు విశేషాలు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గురువారం రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించారు.

రెండో రోజు పర్యటనలో భాగంగా 11 గంటలకు హజ్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో జిన్ పింగ్ భేటీ అయ్యారు. ఆర్దిక, వాణిజ్య బంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా రెండు దేశాల చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో భారతీయ రైల్వేల ఆధునీకరణ, పారిశ్రామిక మండళ్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. భారత్ భూభాగంలో చైనా చొరబాట్లుపై ప్రధాని నరేంద్ర మోడీ గత రాత్రి జిన్ పింగ్‌తో చర్చించినట్లు సమాచారం.

మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కీలక ఒప్పందాలపై వారిరువురూ సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందాల ద్వారా చైనా నుంచి భారత్ కు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary
External Affairs Minister Sushma Swaraj meets Chinese President Xi Jinping in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X