Coronavirus Cases Today: స్వల్పంగా పెరిగిన కేసులు, 3వేల లోపే మరణాలు: భారీగా రికవరీలు

న్యూఢిల్లీ: దేశం కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. అయితే, మరణాల సంఖ్య 3వేల కంటే తక్కువగానే ఉన్నాయి. తాజా, కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వివరాలను వెల్లడించింది.

దేశంలో కొత్తగా 1,34,154 కరోనా కేసులు, 2887 మరణాలు

దేశంలో కొత్తగా 1,34,154 కరోనా కేసులు, 2887 మరణాలు

గత 24 గంటల వ్యవధిలో 21,59,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,34,154 మందికి కరోనా సోకినట్లు తేలింది. వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించడంతో మొత్తం కేసుల సంఖ్య 2,84,41,986కు చేరింది. బుధవారం 2887 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3,37,989కి చేరింది.

భారీగా పెరుగుతున్న రికవరీలు

భారీగా పెరుగుతున్న రికవరీలు

బుధవారం ఒక్కరోజే 2,11,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,63,90,584కు చేరింది. దీంతో రికవరీ రేటు 92.48 శాతానికి పెరిగింది. గత కొద్ది రోజులుగా కొత్త కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత కనిపిస్తోంది.

18 లక్షల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు

18 లక్షల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు

ప్రస్దుతం దేశంలో 17,13,413 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 6.3 శాతానికి తగ్గింది. లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలతో కరోనా కట్టడికి రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటుండటంతో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత కొంతకాలంగా అత్యధిక కేసులు నమోదైన ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తోపాటు 13 రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా తగ్గుతున్నాయి.

అయితే, బీహార్, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు బుధవారం ఒక్కరోజే 24,26,265 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపినీ అయిన డోసుల సంఖ్య 22,10,43,693కు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+