వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూన్ మిషన్‌‍కు ముహూర్తం ఫిక్స్.. జులై 15న చంద్రయాన్ 2..

|
Google Oneindia TeluguNews

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగం కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బెంగళూరులోని శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ సెంటర్‌లో సైంటిస్టులు ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది.

గోల్డెన్ ఛాన్స్ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురాం రాజన్.. గోల్డెన్ ఛాన్స్ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురాం రాజన్..

జులై 9 నుంచి 16మధ్య చంద్రయాన్ 2 చేపట్టనున్నట్లు చెప్పిన ఇస్రో తాజాగా జులై 15న ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 2ను ప్రయోగించనున్నారు. వేకువజామున 2.51 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. దాదాపు రెండు నెలల ప్రయాణం అనంతరం 2019 సెప్టెంబర్ 6న రోవర్ చంద్రుడిపై దిగే అవకాశాలున్నాయి.

India’s second moon mission, Chandrayaan-2 to be launched on July 15

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ ఎంకే 3 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ల్యాండర్‌కు విక్రమ్ అని, రోవర్‌కు ప్రగ్యాన్ అని నామకరణం చేశారు.

ఆర్బిటార్ ప్రొపలేషన్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్రవేశించనుంది. ఆ తర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ్ వేరుపడి చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగుతుంది. శాస్త్రీయ పరీక్షల కోసం రోవర్ అక్కడ తిరగనుంది. చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా 11 పేలోడ్స్ తీసుకెళ్లనున్నారు. వాటిలో 6 భారత్‌కు చెందినవి కాగా... యూరప్‌కు చెందినవి, అమెరికావి 2 ఉన్నాయి.

English summary
ISRO has announced the launch date for India’s ambitious second moon mission, Chandrayan-2, powered by GSLVMK 3. Chandrayaan-2 to will be launched on July 15 at 2.51 am, ISRO said Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X