ఇండియా-చైనా ఘర్షణ: వెనక్కి వెళ్లిపో, డ్రాగన్ బలగాలకు వార్నింగ్..
తూర్పు లడాఖ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఎల్ఏసీ దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న డ్రాగన్ చైనాకు భారత్ ధీటుగానే స్పందిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా బలగాలను మొహరించింది. తమ ప్రాంతంలోకి రావొద్దని భారత్ మరోసారి తేల్చిచెప్పింది.

గతనెల 29వ తేదీ నుంచి పాంగొగ్ సరస్సు దక్షిణ ఒడ్డు నుంచి చొరబడేందుకు ప్రయత్నించింది. కానీ భారత్ ధీటుగా స్పందించడంతో తోకముడిచింది. తమ భూభాగం నుంచి వెళ్లిపోవాలని చైనాకు స్పష్టంచేసింది. మరోవైపు ఈ నెల 7వ తేదీన రెజాంగ్ లా వద్ద చైనా జవాన్లు గాలిలో కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలతో సమస్య పరిష్కారం కాలేదు.
Recommended Video
కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం నిర్వహించడానికి ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటివరకు కార్ప్స్ కమాండర్ స్థాయి ఐదు సమావేశాలను నిర్వహించింది. పొంగాంగ్ సరస్సు పరిసరాల్లో భారత దళాలు కాచుకొని కూర్చొన్నారు. అక్కడినుంచి చొరబడేందుకే చైనా సైనికులు విఫల యత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం సఫీలకృతం కాలేదు.












Click it and Unblock the Notifications