వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెట్ రెడీ: నేటి నుంచే బూస్టర్ డోస్: ఎవరు అర్హులు: ఆ 9 నెలలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కొద్దిరోజుల కిందటి వరకూ 30 వేల వరకు నమోదైన రోజువారీ కేసులు ఒక్కసారిగా లక్షన్నరకు చేరుకున్నాయి. ఇదివరకటి కంటే వేగంగా విస్తరిస్తోంది కోవిడ్ మహమ్మారి. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. ఒమిక్రాన్ వల్లే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందంటూ నిపుణులు సైతం హెచ్చరించారు. దేశంలో పలు నగరాల్లో థర్డ్‌వేవ్ మొదలైందనే భయాందోళనలు మొదలయ్యాయి.

 లక్షన్నరకు పైగా కొత్త కేసులు..

లక్షన్నరకు పైగా కొత్త కేసులు..

ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,59,632 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 327 మంది మరణించారు. 40,863 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువ అయ్యాయి. యాక్టివ్ కేసులు 5,90,611గా రికార్డయ్యాయి. 4,83,790 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 10.27 శాతంగా నమోదైంది.

తొలుత పిల్లలకు..

తొలుత పిల్లలకు..

ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం యుక్త వయస్కుల వారి కోసం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి 15-18 వయస్సున్న వారికి టీకాలను వేయిస్తోంది. ముమ్మరంగా సాగుతోందీ కార్యక్రమం. ప్రభుత్వ కళాశాలల్లో వ్యాక్సిన్ సెంటర్లను సైతం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి. 15 సంవత్సరాలు నిండిన వారికి తొలి డోస్ టీకాను వేస్తోన్నాయి. హైదరాబాదీ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను మాత్రమే దీనికోసం వినియోగిస్తోన్నాయి.

ఇక.. వృద్ధులకు..

ఇక.. వృద్ధులకు..

ఇక వయోధిక వృద్ధుల కోసం బూస్టర్ డోస్‌ను కేంద్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇవ్వాళ్టి నుంచి దేశవ్యాప్తంగా వారికి బూస్టర్ డోస్‌ మొదలవుతుంది. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారు దీనికి అర్హులు. దీనితోపాటు- ఫ్రంట్‌లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోస్‌ వేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు కూడా ఈ తొలిదశ కింద ఈ డోస్‌ను తీసుకోవచ్చు. వారిని కూడా అర్హులుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. వారు తమ ప్రిస్కిప్షన్స్, మెడికల్ హిస్టరీని ఫ్రంట్‌లైన్ వర్కర్లకు చూపించాల్సి ఉంటుంది.

తొమ్మిది నెలల గ్యాప్..

తొమ్మిది నెలల గ్యాప్..

రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తొమ్మిది నెలలు లేదా 39 వారాల వ్యవధి ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇస్తారు. దీనికోసం కొత్తగా కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తొలి డోస్ టీకాను తీసుకోవడానికి ఇదే పోర్టల్‌లో చేయించుకున్న రిజిస్ట్రేషన్ సరిపోతుంది. అందులోనే బూస్టర్ డోస్ వివరాలు నమోదవుతాయి. బూస్టర్ డోసులను తీసుకోవాలంటూ- అర్హులుగా గుర్తించిన వారి ఫోన్ నంబర్‌కు కోవిన్ పోర్టల్ నుంచి ఎస్ఎంఎస్ అందుతుంది.

ఆ అయిదు రాష్ట్రాల్లో మరింత ముమ్మరం..

ఆ అయిదు రాష్ట్రాల్లో మరింత ముమ్మరం..

ఇక వయోధిక వృద్ధుల కోసం బూస్టర్ డోస్‌ను కేంద్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇవ్వాళ్టి నుంచి దేశవ్యాప్తంగా వారికి బూస్టర్ డోస్‌ మొదలవుతుంది. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారు దీనికి అర్హులు. దీనితోపాటు- ఫ్రంట్‌లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోస్‌ వేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు కూడా ఈ తొలిదశ కింద ఈ డోస్‌ను తీసుకోవచ్చు. వారిని కూడా అర్హులుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. వారు తమ ప్రిస్కిప్షన్స్, మెడికల్ హిస్టరీని ఫ్రంట్‌లైన్ వర్కర్లకు చూపించాల్సి ఉంటుంది.

English summary
India to begin administering Covid19 vaccine 'precaution dose' to 60+ age group, healthcare, frontline workers from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X