India TV-CNX Opinion poll:మూడవసారి ప్రధానిగా మోదీ..తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఇవే..!
ఈ వారంలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అన్ని ప్రధాన పార్టీలు గెలుపు తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో...ఒపీనియన్ పోల్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ (India TV-CNX) ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది.
ఇండియా టీవీ -సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్ అంచనా ప్రకారం నరేంద్ర మోదీ వరుసగా మూడవ సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది. 543 లోక్‌సభ సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 378 సీట్లు వస్తాయని ఇండియా టీవీ -సీఎన్ఎక్స్ పేర్కొంది.
ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ (BJP) సింగిల్‌గా 335 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. 2019లో బీజేపీ సింగిల్‌గా 303 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇండియా టీవీ -సీఎన్ఎక్స్ అభిప్రాయసేకరణ చేపట్టింది.ఇది ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 23,2024 మధ్య సేకరించడం జరిగింది. మొత్తం 1,62,900 మంది ఈ ఒపీనియన్ పోల్స్‌లో పాల్గొన్నారు. ఇందులో 84,350 మంది పురుషులుండగా... 78,550 మంది మహిళలున్నారు.

ఒపీనియన్ పోల్స్ ప్రకారం దేశంలోని హిందీ బెల్ట్‌లో బీజేపీ బలంగా ఉందని పేర్కొంది. హిందీ భాష మాట్లాడే చాలా రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది.దక్షిణ భారతంలో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదని అంచనా వేసింది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 74 సీట్లు బీజేపీ గెలుస్తుందని వెల్లడించింది. 2019లో 71 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన రాష్ట్రీయ లోక్‌దల్, అప్నాదల్ చెరో రెండు సీట్లు గెలవనుండగా.. అఖిలేష్ యాదవ్ పార్టీ మరో రెండు సీట్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నెహ్రూ ఇందిరా హయాంలో ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్... ఈ సారి ఒక్క సీటు కూడా గెలవదని అంచనా వేసింది.మాయావతి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ కూడా ఎలాంటి ప్రభావం చూపదని వెల్లడించింది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సీపీఎం పాలిత కేరళ రాష్ట్రంలో బీజేపీ మూడు లోక్‌సభ సీట్లు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో 5 సీట్లు గెలుస్తుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్ ద్వారా వెల్లడించింది.












Click it and Unblock the Notifications