పాక్ వెన్నులో వణుకు పుట్టించేలా.. కేంద్రం స్కెచ్
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి చొరబాట్లు సైతం చోటు చేసుకుంటోండటంతో భారత ఆర్మీ అప్రమత్తంగా ఉంటోంది. రెప్ప వాల్చకుండా పహారా కాస్తోంది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. దీనికి తేదీని కూడా ఖరారు చేసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు భారత్- పాక్ సరిహద్దు పొడవునా ఈ మాక్ డ్రిల్స్ ఉంటాయి. బ్లాక్ అవుట్ సైతం చేపడతారు.

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ తో పాటు నాలుగు రాష్ట్రాలు.. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్.. పాకిస్తాన్ సరిహద్దులను పంచుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాలన్నింట్లోనూ రేపు సాయంత్రం 5 గంటలకు ఈ పూర్తిస్థాయి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.
జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు పొడవునా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది భారత ఆర్మీ. అచ్చంగా పూర్తిస్థాయి యుద్దాన్ని పోలిన విధంగా ఉండబోతోందిది. ఆర్మీ, వాయుసేన, నౌకాదళం ఇందులో పాల్గొంటుంది. గుజరాత్ వరకు నేవీ మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఇక మిగిలిన చోట్ల ఆర్మీ, వైమానిక దళం భాగస్వామ్యమౌతుంది.
శతృవులు ఎదురుగా నిల్చున్నప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలి?, అత్యవసర పరిస్థితులను ఎలా అధిగమించాలి?, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి?, గాయపడ్డ వారిని ఆసుపత్రులకు ఎలా తరలించాలి?, వారికి అవసరమైన రవాణా ఎలా అందుబాటులో ఉంచాలి?.. అనే అంశాలపై ఆ మాక్ డ్రిల్ సాగుతుంది.
వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయడం, వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ లింక్‌ల నిర్వహణ, కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానం కావడం, దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడం, క్రాష్ బ్లాక్ అవుట్‌లో ఎలా వ్యవహరించాలి, అగ్నిమాపక- రెస్క్యూ ఆపరేషన్లల్లో ఎలా పాల్గొనాలి వంటివి ఇందులో నేర్పిస్తారు.
పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 244 జిల్లాల్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ను నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోమ్ గార్డులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు, వలంటీర్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సభ్యులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను ఇందులో భాగస్వామ్యులయ్యారు.
ఇప్పుడు తాజాగా అలాంటి మాక్ డ్రిల్స్ ను ఏకంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో నిర్వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్లాక్ అవుట్స్ సైతం చేపడతామని కేంద్రం వెల్లడించింది. సరిహద్దు గ్రామాల ప్రజలకు ముందుగానే దీనిపై సమాచారం ఇస్తామని, వారిని అప్రమత్తం చేస్తామని పేర్కొంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications