భారత్-అమెరికా వాణిజ్య యుద్ధం:సీన్‌లోకి ఎంటరైన ఇండియన్ ఆర్మీ..!!

భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై భారత్ కూడా ధీటుగా సమాధానం ఇస్తోంది. రష్యాతో చమురు ఒప్పందాలను తెంచుకోవాలంటూ ట్రంప్ భారత్‌పై ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం ఇందుకు తలొగ్గేది లేదంటూ కరాఖండిగా తేల్చేసింది. ఇలాంటి ఇబ్బందులకు అమెరికా గురిచేసినప్పుడు భారత్ బేరానికి రాకపోతే అమెరికా ఏం చేస్తుందో గతంలో ఎలా వ్యవహరించిందో ప్రపంచానికి భారత్ గుర్తుచేస్తోంది. సోషల్ మీడియా వేదికగా భారత ఆర్మీ ఒక పోస్టు చేసింది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.

పాకిస్తాన్‌ను అమెరికా ఎగదోస్తుందా..?
రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయాలని ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు.ఇందుకు భారత్ ససేమిరా అని చెప్పడంతో ఇరు దేశాల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. 1971 భారత్ పాక్ యుద్ధాన్ని ఇండియన్ ఆర్మీ గుర్తు చేసింది. గతంలో అమెరికా ఏ రకంగా పాకిస్తాన్‌కు సహకరించిందో ఈ పోస్టులో హైలైట్ చేసింది.

Indian Army Highlights US Military Aid to Pakistan from 1971 as Trade Tensions Rise

ఒక పాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్ట్రన్ కమాండ్ ఎక్స్ వేదికగా "This Day That Year" Build Up of War - 05 Aug 1971 #KnowFacts. "𝑼.𝑺 𝑨𝑹𝑴𝑺 𝑾𝑶𝑹𝑻𝑯 $2 𝑩𝑰𝑳𝑳𝑰𝑶𝑵 𝑺𝑯𝑰𝑷𝑷𝑬𝑫 𝑻𝑶 𝑷𝑨𝑲𝑰𝑺𝑻𝑨𝑵 𝑺𝑰𝑵𝑪𝑬 '54"పోస్టు చేసింది. 1971 ఆగస్టు 5వ తేదీ యుద్ధానికి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో అమెరికా 2 బిలియన్ డాలర్లు విలువ చేసే ఆయుధాలను పాకిస్తాన్‌కు చేర్చిందంటూ పోస్టు ద్వారా తెలిపింది. 1954వ సంవత్సరం తర్వాత ఆ స్థాయిలో ఆయుధాలను సరఫరా చేయడం అదే తొలిసారంటూ తెలిపే ఓ పాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను పోస్టు చేసింది. ట్రంప్ భారత్‌ పై విధించిన సుంకాలు, ఆ తర్వాత భారత్ ఇచ్చిన రియాక్షన్ తర్వాత తిరిగి ఇండియన్ ఆర్మీ ఈ పోస్టు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..?
ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదంటూ భారత్‌ పై ఆంక్షలు విధించింది అమెరికా యూరోపియన్ సమాఖ్య. అయితే యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే ఐరోపా దేశాలకు రష్యా నుంచి యథావిధిగా చమురు సప్లయ్ అవుతుండటంతో భారత్ కూడా రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడాన్ని తొలినాళ్లలో అమెరికా తప్పుపట్టలేదు సరికదా.. ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం బలోపేతం కోసం భారత్ చేస్తున్న కృషి భేష్ అని పొగిడింది.

రష్యాతో అమెరికా ఐరోపా దేశాలు బిజినెస్ చేయడం లేదా..?
ఇక పాశ్చాత్య దేశాలు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై భారత్ మండిపడింది. రష్యాతో భారీ స్థాయిలో అమెరికా ఐరోపా సమాఖ్య దేశాలు వాణిజ్యం నెరుపుతున్నాయనే విషయాన్ని భారత్ గుర్తుచేసింది.2024లో యురోపియన్ యూనియన్ రష్యా నుంచి ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)ను 16.5 మిలియన్ టన్నుల వరకు దిగుమతి చేసుకున్న విషయాన్ని బయటపెట్టింది. ఇది భారత్ రష్యాతో జరుపుతున్న వాణిజ్యం కంటే చాలా ఎక్కువ. అదే విధంగా రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, పలాడియం, ఎరువులు ఇతర కెమికల్స్‌ను అమెరికా దిగుమతి చేసుకుంటోంది. దేశ ప్రయోజనాలు, మార్కెట్ వాస్తవిక పరిస్థితులు దిగుమతులను నిర్ణయిస్తాయని భారత్ పేర్కొంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆర్థి భద్రతకు భంగం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకుంటామని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు, భారత్ పై అధిక సుంకం విధించడం, రష్యాతో వాణిజ్యంపై ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని భారత్ వాపోతోంది. ఓ వైపు భారత్ తమకు మంచి మిత్రదేశం అని చెబుతూనే మరో వైపు ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని అంతర్జాతీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+