కాబూల్‍లో భారత ఎంబసీ మూసివేత: భారీ విమానంలో భారత్‌కు 140 సిబ్బంది
న్యూఢిల్లీ: ఆప్ఘానిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం అక్కడ పరిస్థితి అల్లకల్లోలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘాన్ నుంచి భారతీయులందరినీ తీసుకొచ్చేందుకు భారత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అంతేగాక, కాబూల్‌లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు మంగళవారం వెల్లడించింది.
Recommended Video
ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కాబూల్‌లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను వెంటనే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరందమ్ బగ్చీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

120 మందికిపైగా అధికారులు, సిబ్బందితో మొత్తం 140ని వాయుసేన సీ-17 విమానం కాబూల్ నుంచి బయల్దేరింది. ఎంబసీకి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకువస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్ గగనతలం నుంచి ఆప్ఘానిస్థాన్‌కు వెళ్లి మనదేశానికి చెందిన పలువురిని తీసుకొచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.
ఇది ఇలావుండగా, ఆప్ఘాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తాలిబన్ల విజయంతో వేగంగా మారితున్న పరిస్థితులపై సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోవడం సహాయక చర్యలకు అవరోధంగా మారిందని తెలిపింది. విమానాల రాకపోకల పునరుద్ధరణ జరగ్గానే తరలింపును చేపడతామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరందమ్ బగ్చి తెలిపారు. ఆప్ఘాన్ నుంచి భారత్‌కు రావాలనుకునే సిక్కులు, హిందువులను తీసుకొచ్చేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.
విద్య, అభివృద్ధి అంశాల్లో మనతో కలిసి పనిచేసిన ఆప్ఘాన్ ప్రజలు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ అండగా ఉంటామన్నారు. సీ-17 గ్లోబ్ మాస్టర్3 భారీ విమానాలను ఆప్ఘాన్‌కు పంపి భారతీయులను తిరిగి తీసుకొస్తామని తెలిపారు.
కాగా, అమెరికా దళాల ఉపసంహరించిన కొద్ది కాలంలోని రెచ్చిపోయిన తాలిబన్లు రెండ్రోజుల క్రితమే ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తమ పాలనను ప్రారంభించారు. దీంతో ఇక తాము స్వేచ్ఛలేని జీవితాన్ని గడపాల్సి వస్తుందంటూ మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, పురుషులు ప్రాణభయంతో ఆప్ఘాన్‌ను వీడుతున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయం జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో అమెరికా దళాలు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందారు. విమానం చక్రాలకు తమను కట్టివేసుకుని ప్రయాణించిన మరో ఇద్దరు గాలిలోకి ఎగిరిన తర్వాత కిందపడి మరణించారు.
ఆప్ఘాన్‌లో భూకంపం
ఇప్పటికే ఆప్ఘనిస్థాన్ అరాచక తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు ఆ దేశ ప్రజలు. తాజాగా, ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. మంగళవారం ఉదయం 6.08 గంటలకు రిక్టారు స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫైజాబాద్‌కు ఈశాన్యంలో 83 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ మేరకు వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా ప్రాణాలు కాపాడుకోవడం కోసం తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.












Click it and Unblock the Notifications