భారత సంతతి జడ్జికి అరుదైన గౌరవం-కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ మహమూద్ జమాల్-తొలి నాన్‌వైట్ కూడా

వలసదారుల పట్ల గొప్ప ఉదారతను చాటుకునే కెనడాలో మరో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన న్యాయకోవిదుడికి అక్కడి సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జి పదవి దక్కింది. అంతేకాదు, కెనడా సుప్రీంకోర్టులో తొలి నాన్ వైట్ జడ్జి కూడా ఆయనే. దీన్ని చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో స్వయంగా ఈ ప్రకటన చేశారు.

కెన‌డా సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్ అయిన జస్టిస్ మహమూద్ జమాల్ ఇప్పటివరకు ఒంటారియో కోర్ట్ ఆఫ్ అప్పీల్ కోర్టులో జడ్జిగా పనిచేశారు. కెనడాలోని రెండు అగ్ర‌శ్రేణి లా కాలేజీల్లోనూ అధ్యాపకుడిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో 35 అప్పీళ్ల‌తోపాటు ద‌శాబ్దాలుగా న్యాయ‌వాదిగా సేవ‌లందించిన అనుభవం ఆయనది.

Indian-origin first non-white Judge Mahmud Jamal nominated to Canada Supreme Court

''జస్టిస్ మహమూద్ జమాల్ సుప్రీంకోర్టుకు ఎంతో విలువైన ఆస్తి. అందుకే, మ‌న‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో న్యాయ‌మూర్తిగా ఆయ‌న్ను నామినేట్ చేస్తూ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నా'' అని ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. జస్టిస్ మ‌హ‌మూద్ జ‌మాల్ నామినేష‌న్‌ను హౌస్ ఆఫ్ కామ‌న్స్ జ‌స్టిస్ క‌మిటీ ఆమోదించడం ఇక లాంఛనమే.

1967లో నైరోబి(కెన్యా)లో భారత సంతతి కుటుంబంలో మహమూద్ జమాల్ జన్మించారు. 1979లో వరి కుటుంబం బ్రిటన్ కు వలస వెళ్లి, అక్కడి నుంచి 1981లో కెనడాకు చేరి, అక్కడే స్థిరపడింది. కెనడా జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న మైనార్టీల అభ్యున్నతి కోసం ట్రూడో ప్రభుత్వం అనేకానేక చర్యలు చేపట్టడం తెలిసిందే. నల్ల జాతీయులు, ముస్లింలు, ఇత‌ర మైనారిటీల‌కు వ్య‌తిరేకంగా సాగిన సాంస్క్రుతిక మార‌ణ హోమంపై విచార‌ణ‌కు కెన‌డా ప్ర‌భుత్వం క‌మిష‌న్‌ను నియ‌మించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+