వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పండగల సీజన్: 200 ప్రత్యేక రైళ్లను నడపనున్న ఇండియన్ రైల్వే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో పండగల సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైందని భారతీయ రైల్వే. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

Recommended Video

Indian Railways : పండగల సీజన్లో సందడి చేయనున్న 200 ప్రత్యేక రైళ్లు! - భారతీయ రైల్వే || Oneindia

కరోనా కారణంగా మార్చి 22 నుంచి సాధారణ ప్రయాణికుల రైళ్లు నడపడం లేదు. తాజాగా, పండగ సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో కరోనా సమస్య తక్కువగా ఉంటే 200 కంటే ఎక్కువ రైళ్లనే నడుపుతామని వీకే యాదవ్ పేర్కొన్నారు.

 Indian Railways to run 200 special trains from October 15 for festival season

కాగా, గత ఆరు నెలలుగా కరోనా లాక్‌డౌన్ కారణంగా రైల్వే సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడిపిన విషయం తెలిసిందే. అన్‌లాక్ ఇప్పటికే దాదాపు అన్ని కార్యకలాపాలకు ప్రారంభమవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 65,87,262 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 9,40,969 యాక్టివ్ కేసులున్నాయి. 55,43,213 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,02,157 మంది కరోనా సోకి మరణించారు.

English summary
Indian Railways is planning to run 200 additional IRCTC special trains between October 15 and November 30 to deal with huge number of crowd travelling during the festive season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X