Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియా టీవీ ఫైనల్ ఒపీనియన్ సర్వే: బీజేపీకి 85సీట్లు, ఏ సర్వే ఏం చెప్పిందంటే?

బెంగళూరు: 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు మరో రెండు మూడు రోజులే ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 58,000 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా 600 కేంద్రాలు కేటాయించారు. పదికి పైగా కేంద్రాలను దివ్యాంగుల కోసం కేటాయించారు.

ఈ ఎన్నికల్లో 80,000 వీవీపాట్‌లు (ఓటర్‌ వెరిఫైడ్‌ ఆడిట్‌ ట్రయల్‌) యంత్రాలతో పాటు 80,000 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరైనా ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిస్తే వారిపై నిషేధం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

IndiaTV Final Opinion Poll on Karnataka Elections: BJP likely to win 85 seats

ఈ నేపథ్యంలో, ఇండియా టీవీ తాజాగా చేసిన సర్వే ఆసక్తిగా మారింది. ఎన్నికలకు రెండు రోజుల ముందు వెలువడిన ఈ సర్వేలో హంగ్ అసెంబ్లీ వస్తుందని తేలింది. బీజేపీకి 85 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 96 స్థానాలు, జేడీఎస్‌కు 38 స్థానాలు, ఇతరులకు నాలుగు స్థానాలు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కర్నాటకలోని 223 సీట్లకు గాను పైవిధంగా ఆయా పార్టీలు సీట్లు గెలుచుకోనున్నాయి.

సౌత్ కర్నాటకలో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 24, హైదరాబాద్ కర్నాటకలో బీజేపీకి 15, కాంగ్రెస్‌కు 14, జేడీఎస్‌కు 2, సెంట్రల్ కర్నాటకలో బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 13, జేడీఎస్‌కు 2, గ్రేటర్ బెంగళూరులో బీజేపీకి 13, కాంగ్రెస్‌కు 18, జేడీఎస్‌కు 1, కోస్టల్ కర్నాటకలో బీజేపీకి 9, కాంగ్రెస్‌కు 10, జేడీఎస్‌కు 2, బాంబే కర్నాటకలో బీజేపీకి 23, కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 4 సీట్లు వస్తాయని ఇండియా టీవీ సర్వేలో వెల్లడైంది.

ఇంతకుముందు కూడా వివిధ పోల్ సర్వేలు విడుదలయ్యాయి.
సువర్ణ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీకి 102, కాంగ్రెస్‌కు 72, జేడీఎస్‌కు 44 సీట్లు వస్తాయని తేలింది. సీఫోర్ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీకి 68, కాంగ్రెస్‌కు 123, జేడీఎస్‌కు 32 స్థానాలు వస్తాయని తేలింది. సీఎస్‌డీఎస్ ప్రకారం బీజేపీకి 84, కాంగ్రెస్‌కు 97కు, జేడీఎస్‌కు 37 స్థానాలు వస్తాయి. కార్వీ ప్రకారం బీజేపీకి 82, కాంగ్రెస్‌కు 96, జేడీఎస్‌కు 38 వస్తాయి. వీఎంఆర్ ప్రకారం బీజేపీకి 89, కాంగ్రెస్‌కు 91, జేడీఎస్‌కు 40 స్థానాలు వస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+