Flight Tickets: విమాన టికెట్లపై కేంద్రం కీలక నిర్ణయం..! ఎయిర్ లైన్స్ కు షాక్..!

ఇండిగో సంక్షోభం సమయంలో ప్రయాణీకులను రక్షించడానికి విపరీతంగా పెరిగిన విమాన ఛార్జీలను పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్న ఇతర విమానయాన సంస్థలకు కేంద్రం ఇవాళ షాకిచ్చింది. ఇండిగో ఎయిర్ లైన్స్ రోజూ వందలాది విమానాలు రద్దు చేస్తుండటం, ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్న నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఇండిగో ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ఇతర ఎయిర్ లైన్స్ రంగంలోకి దిగాయి.

రోజుల తరబడి ఇండిగో విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఇక చేసేది లేక ఇతర ఎయిర్ లైన్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇండిగోతో పోలిస్తే తక్కువ విమానాలు కలిగిన ఇతర సంస్థలకు మంచి అవకాశం దొరికినట్లయింది. దీన్ని వాడుకునేందుకు వెంటనే రంగంలోకి దిగిపోయిన ఆయా ఎయిర్ లైన్స్.. ప్రయాణికులను బాదేస్తున్నాయి. టికెట్ల రేట్లను అసాధారణంగా పెంచేస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన కేంద్రం మరింత ఇరుకునపడుతోంది.

IndiGo Crisis Fallout Centre Cracks Down on Opportunistic Airlines Over Soaring Fares

ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ రంగంలోకి దిగింది. ఇండిగో సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుంటున్న ఇతర ఎయిర్ లైన్ సంస్థలపై కొరడా ఝళిపించాలని నిర్ణయించింది. ఇతర ఎయిర్ లైన్ సంస్థల అవకాశవాదాన్ని తప్పుబడుతూ టికెట్ రేట్లను పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని ఎయిర్ లైన్ సంస్థలకూ ఆదేశాలు పంపింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఎయిర్ లైన్స్ (Airlines) అసాధారణంగా ఎక్కువ విమాన ఛార్జీలు విధించడాన్ని తీవ్రంగా పరిగణించినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. అవకాశవాద ధరల నుండి ప్రయాణీకులను రక్షించడానికి, ప్రభావితమైన అన్ని మార్గాలలో న్యాయమైన , సహేతుకమైన ఛార్జీలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుందని తెలిపింది. ఇండిగో కార్యకలాపాలు స్థిరీకరించబడే వరకు కొత్తగా సూచించిన పరిమితులను ఖచ్చితంగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచించింది.

IndiGo Crisis Fallout Centre Cracks Down on Opportunistic Airlines Over Soaring Fares

ఇండిగో విమానాల వరుస రద్దు నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు , వైద్య ప్రయాణీకులు సహా వేలాది మంది సీట్లు పొందడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ధరల పెంపును అడ్డుకోవడానికి, దోపిడీని నిరోధించడానికి ఈ చర్య అవసరమని భావించినట్లు కేంద్రం తమ ప్రకటనలో తెలిపింది. ఛార్జీల స్థాయిలపై ఈ మేరకు నిఘా పెడుతున్నట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+