వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని తీరు బాగా లేదంటే బాంబు ఉందని పోన్, అరెస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పనితీరు సరిగా లేదని సీనియర్ ఉద్యోగులు వార్నింగ్ ఇవ్వడంతో ఎయిర్‌లైన్స్‌కు కాల్ చేసి బుద్ది చెప్పాలనుకొన్న ఓ ఉద్యోగి ఇండిగో విమానంలో బాంబు ఉందని ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని నిందితుడే పోలీసుల విచారణలో వెల్లడించాడు.

మహారాష్ట్రలోని పూణేకు చెందిన కార్తీక్ మాధవ్ భట్ హాస్పిటలాలిటీలో డిప్లొమా కోర్స్ పూర్తి చేశాడు. అనంతరం ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ గా విదుల్లో చేరారు.

IndiGo employee makes hoax bomb call as he wanted to ‘teach airline a lesson’

వర్క్ బాగా చేయడం లేదని, ఇంకా పనితీరు మెరుగుపర్చుకోవాలని సీనియర్లు కార్తీక్‌కు ఇటీవల హెచ్చరించారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు బుద్ది చెప్పాలని భావించాడు. మే 2న ముంబైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందని ఫోన్ చేశాడు.

అయితే ఈ విషయమై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు ప్రయాణీకుల లగేజీతో పాటు విమానాన్ని తనిఖీ చేశారు. అయితే ఈ ఫోన్ ఫేక్ కాల్ అంటూ తేల్చి చెప్పారు.

విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కార్తీక్‌ను తాజాగా అరెస్ట్‌ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. తన పనితీరు బాగున్నా సీనియర్‌ ఉద్యోగులు వంకలు పెట్టారన్న కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫోన్‌చేసి బాంబు అని బెదిరించినట్లు నిందితుడు అంగీకరించాడు.

English summary
A 23-year-old staffer of budget carrier IndiGo was arrested for allegedly making a hoax call regarding a bomb on a Mumbai-bound flight on May 2, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X