భారత్ కు తీవ్ర అన్యాయం.. ఇక సహించబోం: ఎర్రకోట నుంచి మోదీ సంచలన ప్రకటన
యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.అసేతు హిమాచలం.. వందేమాతరం అనే నినాదం వినిపిస్తోందని అన్నారు.

తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని, వాళ్ల వెన్ను విరిచామని అన్నారు. దేశ ప్రజలపై తుపాకి ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ తాజా ఉదాహరణ అని మోదీ చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ హీరోలకు సెల్యూట్ చేశారు. పాకిస్తాన్‌లో జరిగిన భారీ విధ్వంసం గురించి వివరించారు. పహల్గామ్ మారణకాండకు ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టామని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన సరిహద్దులు దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించిన ఉగ్రవాదులు మతం గురించి ఆరా తీసి మరీ మారణకాండకు పాల్పడ్డారని ప్రధాని గుర్తుచేశారు.
ఈ దుశ్చర్య దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆ ఆగ్రహాన్ని ఆపరేషన్ సింధూర్ రూపంలో వ్యక్తీకరించామని మోదీ అన్నారు. ఏప్రిల్ 22 తర్వాత భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన తేల్చి చెప్పారు. వ్యూహం, లక్ష్యం, సమయం వంటి అన్నింటినీ నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి కల్పించామని పునరుద్ఘాటించారు.
గత దశాబ్దాల్లో ఎన్నడూ చేయని విధంగా భారత బలగాలు శత్రు భూభాగంలోకి వందల కిలోమీటర్లు చొచ్చుకుపోయి, ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను నేలమట్టం చేశాయని ప్రధాని మోదీ వివరించారు. పాకిస్తాన్‌లో జరిగిన విధ్వంసం అంచనాలకు మించి ఉందని, దీనిపై రోజూ కొత్త విషయాలు, సమాచారం బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందం నిలుపుదల గురించి మాట్లాడారు మోదీ. సింధు నదీ జలాల ఒప్పందం అన్యాయమైనదని, పూర్తిగా ఏకపక్షమైనదని మోదీ పేర్కొన్నారు. రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సింధూ జలాల నిలిపివేత శత్రువులకు ఊహించని శిక్ష విధించిందని అన్నారు. ఈ నిర్ణయం దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని తేల్చి చెప్పారు.
సింధు నదీ జలాల ఒప్పందం ఎంత అన్యాయమైనదో.. ఏకపక్షమైనదో దేశ ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌లో పుట్టిన నదుల నీరు మన శత్రువుల పొలాలను సాగు చేస్తుండగా.. సొంత దేశ రైతులు, భూమి నీరు లేక దాహంతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడు దశాబ్దాలుగా మన రైతులకు ఇంత తీరని నష్టాన్ని కలిగించిన సింధూ జలాల్లో న్యాయమైన వాటా పొందే హక్కు భారత్ కు మాత్రమే ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. సింధు జలాల ఒప్పందం వల్ల జరుగుతున్న నష్టాన్ని భారత్ ఇకపై సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం రైతుల ప్రయోజనాలకు గానీ, దేశ ప్రయోజనాలకు గానీ అనుకూలమైనది కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా పాక్ నాయకులు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై భారత్‌ను బెదిరించిన తర్వాత ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications