ఊహించని నిర్ణయం: ఇన్ఫోసిస్ స్టాక్ అమ్మేస్తున్నారా?.. దెబ్బకు షేర్లు ఢమాల్
కంపెనీ సహ వ్యవస్థాపకులు 12.75శాతం స్టాక్ అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ 28వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్టాక్ అమ్మేస్తున్నారన్న ప్రచారంతో కంపెనీ స్టాక్ కనిష్ట స్థాయికి పడిప
బెంగుళూరు: నిన్నటికి నిన్న విప్రో కంపెనీ మేనేజ్‌మెంట్ చేతులు మారబోతుందన్న ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. కంపెనీలో మేజర్ వాటా కలిగిన ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, ఆయన కుటుంబ సభ్యులు తమ వాటాలను విక్రయించడానికి నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చిన ప్రేమ్‌జీ అలాంటిదేమి లేదని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
తాజాగా మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ విషయంలోను అలాంటి వార్తే తెర పైకి వచ్చింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ వాటాలను విక్రయించడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. స్టాక్ మొత్తం అమ్మేయాలని వారు నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియదు గానీ ఈ ప్రభావంతో కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో కంపెనీ షేర్ 3.47శాతం మేర పడిపోయినట్లు సమాచారం.

కాగా, కంపెనీ సహ వ్యవస్థాపకులు 12.75శాతం స్టాక్ అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ 28వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్టాక్ అమ్మేస్తున్నారన్న ప్రచారంతో కంపెనీ స్టాక్ కనిష్ట స్థాయికి పడిపోయింది. మే5 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి అని రిపోర్టులు చెబుతున్నాయి.
మరోవైపు ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. స్టాక్ అమ్మకం ప్రచారాన్ని ఆయన కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు సమాచారం. కార్పోరేట్ గవర్నెర్స్‌పై ఇప్పటికే పలుమార్లు బోర్డు సభ్యులను మందలించినా.. వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదని చెబుతున్నారు.
ఖండించిన ఇన్ఫోసిస్:
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ స్టాక్ అమ్మేయాలనుకుంటున్నారన్న ప్రచారాన్ని ఆ సంస్థ యాజమాన్యం ఖండించింది. దయచేసి ఇటువంటి నిరాధార వార్తలకు మీడియా ప్రాధాన్యం కల్పించవద్దని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ప్రచారం వల్ల కంపెనీతో పాటు స్టాక్ హోల్డర్స్ నష్టపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications