Narayana Murthy: జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన నారాయణ మూర్తి..

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భారత్ లో పెరుగుతోన్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీలో జరిగిన కాన్వకేషన్ వేడుకలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. "అధిక జనాభా పెరుగుదల రాబోయే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో మన దేశంపై వినాశనం కలిగించే అవకాశం ఉంది" అని విద్యార్థులతో చెప్పారు.

"ఎమర్జెన్సీ సమయంలో బలవంతపు స్టెరిలైజేషన్‌ను అధికం చేసినప్పటి నుంచి జనాభా నియంత్రణను ఉంచలేదు. భారతదేశంలో తలసరి భూమి లభ్యత తక్కువ. యునైటెడ్ స్టేట్స్‌లో కేవలం 7 శాతం, బ్రెజిల్‌లో ఇది కేవలం 5 శాతం మాత్రమే. పెద్ద భూభాగాన్ని కలిగి ఉన్న దేశాలలో భారతదేశ తలసరి భూమి చైనా కంటే మూడింట ఒక వంతు ఉంది" అని నారాయణ మూర్తి చెప్పారు.

Narayana Murthy

భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, తాగుగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోటుందని చెప్పారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని అని అన్నారు. నిజనమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయని చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్‌ మాటలు నారాయణ మూర్తి చెప్పారు.

మూర్తి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి వచ్చిన టెక్నాలజీ రివ్యూలో ఒక కథనాన్ని ఉటంకిస్తూ, నీటి లభ్యతపై అధిక జనాభా పెరుగుదల ప్రభావాన్ని గుర్తు చేశారు. "ప్రపంచంలోని మంచినీటిలో భారతదేశంలో కేవలం 4 శాతం మాత్రమే ఉంది. అయితే భారత్ జనాభా ప్రపంచ జనాభాలో 16 శాతం వాటా ఉంది. జనాభా పెరుగుదల రేటును తగ్గించడం అత్యంత తక్షణ అవసరం" అని ఆయన అన్నారు.

Narayana Murthy

"భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తమ జనాభా పెరుగుదల రేటును తగ్గించడంలో మంచి పురోగతిని సాధిస్తున్నాయి. మరికొందరు ఈ ముఖ్యమైన అంశంపై తగినంత శ్రద్ధ చూపలేదు" అని వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అన్నారు. "ప్రతి పౌరుడు తన సొంత విశ్వాసాలను ఇతరులపై రుద్దకుండా, ఇతరుల పురోగతికి ఆటంకం కలిగించకుండా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉన్న బహుత్వ వాతావరణంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా పనిచేస్తుంది" అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+