కిల్లర్‌ను ఉరితీయండి: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి పేరెంట్స్
చెన్నై: తమిళనాడులో తమ కూతురిని హత్య చేసిన రామ్ కుమార్‌కు ఉరిశిక్ష వేయాలని ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతీ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో 24 ఏళ్ల స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ (22)ను పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
స్వాతి హంతకుడికి అత్యంత కఠిన మైన శిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు ఆదివారంనాడు డిమాండ్ చేశారు. రామ్‌కుమార్‌కు మరణశిక్ష విధించాలని స్వాతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పెళ్లి ప్రతిపాదనను అంగీకరించనందువల్లే రామ్‌కుమార్ ఆమెను దారుణంగా హతమార్చాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతి హంతకుడిని పట్టుకున్నందుకు వారు ఆదివారం మీడియా సమావేశంలో చెన్నై పోలీసులకు, తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తన మిత్రుడొకతను తనను ఇబ్బందిపెడుతున్నాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని స్వాతి చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులొకరు చెప్పారు.
అయితే చెన్నై పోలీసులు మాత్రం రామ్‌కుమార్ మానసిక పరిస్థితి స్థిరంగా లేదని చెప్తున్నారు. పెళ్లి చేసుకుందామని పదే పదే రామ్‌కుమార్ చేసిన ప్రతిపాదనలను స్వాతి తిరస్కరించినందువల్లే ఆగ్రహంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications