ఆ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్లు, నల్లధనమని ఐ.టి. శాఖ అనుమానం

డిల్లీలోని జైన్ కో ఆపరేటివ్ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్లు అయ్యాయి,పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత ఈ నగదును డిపాజిట్ చేశారు.అయితే ఈ నగదును నల్లధనంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ప్రైవేట్ , ప్రభుత్వ బ్యాంకుల్లో అక్రమంగా నల్లధనాన్ని మార్పిడిచేసుకొనేందుకుగాను అక్రమార్కులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని జైన్ కోఆపరేటిట్ బ్యాంకులో సుమారు 120 కోట్ల నగదు డిపాజిట్లను ఆదాయపు పన్నుశాఖ అధికారులు గుర్తించారు. ఈ నగదు నల్లధనంగా ఐటిశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

ఆధాయపు పన్నుశాఖకు చెందిన డిల్లీశాఖాధికారులు డిల్లీలోని జైన్ బ్యాంకు బ్రాంచ్ లో దాడులు చేసి షాక్ గురయ్యారు. నల్లధనం ఈ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్ చేశారని అధికారులు అనుమానిస్తున్నారు.

inocome tax department uncovers rs120 crore deposited in jain cooperative bank

ఢిల్లీలోని జైన్ కో ఆపరేటివ్ బ్యాంకులోని లావాదేవీలపై ఐదురోజులుగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నల్లధనం ఉన్నట్టు గుర్తించారు.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఈ బ్యాంకులో పెద్ద ఎత్తున నగదు జమ కావడంతో అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ నగదును ఎవరెవరు ఎప్పుడు డిపాజిట్ చేశారు. వారికి ఈ నగదు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నల్లధనాన్ని మార్పిడిచేసుకొనేందుకుగాను అక్రమార్కులు బ్యాంకులను ఉపయోగించుకొంటున్నారని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+