నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర..

ప్రపంచ ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథుని రథయాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ విదియ నాడు నిర్వహించే ఈ పవిత్ర యాత్రను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తుంటారు. ఆలయ ప్రాంగణం నుంచి గుండిచా మందిరానికి మూడు రథాల వెంటే భక్తులు కదిలి వెళ్తుంటారు. దీంతో ఈ మహత్తర ఘట్టానికి సంబంధించిన విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఈ ఏడాది రథయాత్రను ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారు 12 లక్షల మంది భక్తులు పూరీలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పూరీ నగరం ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోగా.. ఒడిశా ప్రభుత్వం ఈసారి భద్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది. దాదాపు 275 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్‌లు ఏర్పాటు చేశారు. అలానే భద్రత కోసం 10 వేల మంది పోలీస్ జవాన్లను నియమించారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని రాష్ట్ర డీజీపీ ఖురానియా వెల్లడించారు.

interesting-details-of-rath-yatra-of-lord-jagannath-in-puri

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్య ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్‌లు, 265 ఆసుపత్రి పడకలు, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. AIIMS భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా విధుల్లో పాల్గొంటున్నారు.

మరోవైపు ఈసారి యాత్రను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యావరణ అనుకూలంగా ఉండేలా వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాల సౌకర్యం, భక్తుల కోసం శరనార్థి కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు, నీటి పంపిణీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. తలపాగా, శీతల పానీయాల వితరణ కూడా జరుగుతోంది.

పూరీకి వెళ్లలేని భక్తుల కోసం రథయాత్రను లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌‍లు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా యాత్రను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. జగన్నాథుని రథయాత్ర కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, సంస్కృతి, సమైక్యత, విశ్వశాంతికి ప్రతీకగా నిలుస్తుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+