Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆమె కోసం వెదికిన కళ్లు: కోహ్లీ టీమ్‌లో మెరిసిన బ్యూటీ ఎవరు? ఫోకస్ ఆమెపై: మసాజ్ స్పెషలిస్ట్‌

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా దుబాయ్‌లో సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన నెయిల్ బైటింగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఘన విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 200లకు పైగా టార్గెట్‌ను ఛేదించడానికి విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ టీమ్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా, యార్కర్లను సంధించడంలో దిట్టగా పేరున్న జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని.. విజయాన్ని అందుకుంది.

ఆమె కోసం వెదికిన కళ్లు..

ఆమె కోసం వెదికిన కళ్లు..

రాయల్ ఛాలెంజర్స్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని టీమ్ మెంబర్స్ కంటే కూడా ఎక్కువగా అస్వాదించిన వారిలో ఓ బ్యూటీ ఉన్నారు. విరాట్ కోహ్లీ టీమ్‌లో ఆమె తళుక్కుమంటూ మెరిశారు. రాయల్ ఛాలెంజర్స్ జెర్సీని ధరించి, టీమ్ ప్లేయర్లతో పాటు డగౌట్‌లో తళుక్కుమని మెరిశారు. మ్యాచ్ కొనసాగుతున్నంత సేపూ ప్రేక్షకుల కళ్లు ఆమె మీదే నిలిచాయి. ఆమె కోసం వెదికాయి. డగౌట్‌ను ఎప్పుడెప్పుడు చూపిస్తారా? అంటూ ఆశపడ్డ హృదయాలు చాలానే ఉన్నాయి. అందుకేనేమో- డగౌట్‌ను చూపించిన ప్రతీసారీ.. కెమెరామెన్ కూడా ఆ అందగత్తె మీదే ఫోకస్ పెట్టాడు.

 ఎప్పుడూ కనిపించలేదే?

ఎప్పుడూ కనిపించలేదే?

అంతకుముందు ఎప్పుడూ ఆ రూపం.. రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌లో కనిపించలేదు. అలాంటిది- ఈ సారి ఏకంగా డగౌట్‌లోనే పాగా వేయడం క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి రేపింది. తొలుత- ఫ్రాంఛైజీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తుండవచ్చని భావించారు అభిమానులు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ప్రీతిజింతా తరహాలో ఆమె కూడా ప్రత్యక్షంగా మ్యాచ్‌ను తిలకించడానికి దుబాయ్‌కు వచ్చి ఉండొచ్చనీ అనుమానించారు. ఆమె ఫ్రాంఛైజీ ప్రతినిధురాలు కాదని తేలిపోయింది. సో- దీనితో ఆమె గురించి ఆరా తీయడం ఆరంభించారు క్రికెట్ ప్రేమికులు.

ఇంతకీ ఎవరా బ్యూటీ?

ఇంతకీ ఎవరా బ్యూటీ?

ఆమె పేరు నవనీత గౌతమ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మసాజ్ థెరపిస్ట్. సపోర్టింగ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదే ఆమె తొలి ఐపీఎల్ సీజన్. ఓ స్పెషలిస్ట్ మసాజ్ థెరపిస్ట్‌గా ఆమె తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగు పెట్టారు. నవనీతా గౌతమ్‌ను మసాజ్ థెరపిస్ట్‌గా నియమించుకున్నట్లు గత ఏడాది అక్టోబర్‌లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. నవనీతా గౌతమ్‌ నియామకానికి ముందు- ఏ టీమ్‌లో కూడా మహిళా సపోర్టింగ్ సిబ్బంది లేరు. ఇంతకుముందు- దక్కన్ ఛార్జెర్స్ టీమ్‌లో ఇద్దరు మహిళా సపోర్టింగ్ స్టాఫ్ ఉండేవారు. ఇప్పుడు దక్కన్ ఛార్జర్స్ మేనేజ్‌మెంట్ మారిపోయింది.

Recommended Video

    IPL 2020,RCB vs MI Highlights : Royal Challengers Defeated Mumbai Indians In Super Over || Oneindia
     కెనడాకు చెందిన నవనీత

    కెనడాకు చెందిన నవనీత

    నవనీత గౌతమ్ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. ఆమెకు ఐపీఎల్ కొత్తే. అయినప్పటికీ.. ఓ క్రికెట్ టీమ్‌కు మసాజ్ థెరపిస్ట్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు గ్లోబల్ టీ20 కెనడా లీగ్ ఛాంపియన్స్‌షిప్ టోర్నమెంట్‌లో పనిచేశారు. టోరంటో నేషనల్స్‌కు ఆమె మసాజ్ థెరపిస్ట్‌గా పని చేశారు. అలాగే- ఆసియాకప్ సమయంలో భారత మహిళా బాస్కెట్ బాల్ టీమ్‌కూ ఆమెనే మసాజ్ థెరపిస్ట్. తాను పనిచేస్తోన్న టీమ్ సూపర్ ఓవర్‌లో ఘన విజయాన్ని సాధించడంలో నవనీత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. జట్టు సభ్యులతో కలిసి ఆమె ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+