IPL 2023 : కోల్ కతాతో మ్యాచ్ లో మరోసారి "ధోనీ రివ్యూ సిస్టమ్"...!

ఈసారి ఐపీఎల్ 2023 సీజన్లో డీఆర్ఎస్ ను గురించిన చర్చ సర్వత్రా సాగుతోంది. దీనికి కారణం డీఆర్ఎస్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న జట్లు, ఆటగాళ్లు, కెప్టెన్ల గురించి అంతా మాట్లాడుకోవడమే. ఇదే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఈ డీఆర్ఎస్ ను కోల్ కతాతో నిన్న జరిగిన మ్యాచ్ లో తన జట్టుకు అనుకూలంగా మలచుకున్నాడు. దీంతో ఇప్పుడు ధోనీ డీఆర్ఎస్ ను వాడుకున్న తీరుపై చర్చ జరుగుతోంది.

నిన్న ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ 2023 గేమ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీ పడినప్పుడు 'ధోనీ రివ్యూ సిస్టమ్' మరోసారి తెరపైకి వచ్చింది. సాధారణంగా ఐపీఎల్ లో ఆడుతున్న జట్లు, క్రికెటర్లు డీఆర్ఎస్ ను వాడుకుంటున్న తీరు ఓ ఎత్తయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ డీఆర్ఎస్ ను వాడుకుంటున్న తీరు ఎప్పుడూ ఆసక్తికరమే. దీంతో ఇప్పుడు కోల్ కతా వర్సెస్ చెన్నై మ్యాచ్ లో డీఆర్ఎస్ వాడకం చర్చనీయాంశమవుతోంది.

IPL 2023 : CSK captain MS Dhoni utilize DRS as Dhoni Review System again against KKR

నిన్న చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడుతున్నప్పుడు 'ధోనీ రివ్యూ సిస్టమ్' మరోసారి చర్చకు వచ్చింది. కేకేఆర్ ఛేజింగ్ లో 18వ ఓవర్ మూడవ బంతికి, ఎంఎస్ ధోని నుండి అద్భుతమైన సమీక్ష డేవిడ్ వైస్ ను పెవిలియన్ కు పంపింది.

ఈ ఓవర్ లో తుషార్ దేశ్‌పాండే వేసిన స్లో బాల్ వైస్ ప్యాడ్‌కు తగిలింది. అయితే అంపైర్ అప్పీల్‌తో ఒప్పుకోలేదు. దీంతో ధోనీ డీఆర్ఎస్ నువాడుకోవాలని నిర్ణయించాడు. దీంతో రివ్యూలో బంతి స్టంప్‌లను తాకినట్లు తేలింది. వైస్ పెవిలియన్ ముఖం పట్టక తప్పలేదు.

ఈ మ్యాచ్ లో ధోనీ వ్యూహాలు ఫలించి కోల్ కతాను చెన్నై 49 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మధ్య పూర్తి టీ 20 ఆటగాడిగా మారిపోయిన ఆజింక్యా రహానే కేవలం 29 బంతుల్లోనే 71 పరుగులు సాధించడం చెన్నైకు పూర్తిగా కలిసొచ్చింది. రహానే తన సంచలన స్ట్రోక్-ప్లేతో ఈడెన్ గార్డెన్స్‌లో ఓ తుఫానే సృష్టించాడు. దీనికి తోడు శివమ్ దూబే (21 బంతుల్లో 50), నిలకడగా రాణిస్తున్న డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56) కూడా సత్తా చూపడంతో సీఎస్కే 235 పరుగులు చేసింది. ఆ తర్వాత కోల్ కతా 186కి పరిమితమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+