భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్!

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న భీకర పోరులో భారత్‌కు ఉపశమనం లభించింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా భారత్‌తో సహా మిత్రదేశాల నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. భారత్‌తో పాటు రష్యా, చైనా, ఇరాక్, పాకిస్థాన్ దేశాలకు ఈ మినహాయింపు లభించింది. "హోర్ముజ్ జలసంధి కేవలం శత్రుదేశాలకే మూసివేయబడింది.. భారత్ వంటి మిత్ర దేశాలకు కాదు" అని అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.

దేశంలో చమురు, గ్యాస్ సరఫరాపై క్లారిటీ
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలను కేంద్ర సర్కారు కొట్టిపారేసింది. ఇవన్నీ కేవలం అపోహలని, దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఒక నెలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇరాన్ తాజా నిర్ణయంతో హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన భారతీయ నౌకలు దేశానికి చేరుకోవడానికి మార్గం సుగమమైంది. ఇది ఇంధన సరఫరాను మరింత వేగవంతం చేస్తుంది.

Iran Opens Strait of Hormuz for Indian Ships PM Modi to Meet CMs on Energy Security and Supplies

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, దేశంపై వాటి ప్రభావం గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఇంధన భద్రత, విదేశాల్లో ఉన్ భారతీయుల రక్షణ, గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ నిల్వలను అరికట్టడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+