ఢిల్లీలో హంగ్ తప్పదా: బీజేపీ గెలుస్తుందని, కాదని... సర్వేలు
న్యూఢిల్లీ: అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదా? అంటే అవునని, కాదని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకుంటుందని, కాదు.. మూడు నాలుగు సీట్లు తక్కువ పడతాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి.
బీజేపీ అంతర్గతంగా చేసుకున్న సర్వేలో... ఆ పార్టీకి 32 సీట్లు వస్తాయని తెలిసినట్లుగా సమాచారం. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మేజిక్ ఫిగర్ 36. అధికారం కోసం మరో నాలుగు సీట్లు తక్కువ కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇతర రాష్ట్రాల్లో (జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర) వలే ఊపు ఉండకపోవచ్చునని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ సర్వేలో తెలినట్లుగా తెలుస్తోంది. దేశ రాజధానిలోని అర్బన్ ప్రాంతంలోనే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందంటున్నారు. పూర్వాంచల్‌లో 24 శాతం ఓట్లు ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఏఏపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి ప్రచారంలో ప్రధాని మోడీ పూర్వాంచల్ ఓటర్లను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

తాను పూర్వాంచల్‌కు చెందిన వాడిని, తాను వారణాసి నుండి ఎంపీగా ప్రాతనిథ్యం వహిస్తున్నాని, భారత దేశాన్ని నిజమైన అభివృద్ధి దేశంగా మలిచేందుకు కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు.
మరో సర్వేలో బీజేపీదే పీఠం
హస్తినలో బీజేపీ విజయబావుటా ఎగురవేస్తుందని ది వీక్-ఐఎంఆర్బీ సర్వేలో తేలింది. బీజేపీ 70 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలని 40 శాతం మంది ఓటర్లు కిరణ్ బేడీ సీఎం కావాలి 39 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు. మరోవైపు, ఇండియా టీవీ - సీ ఓటరు సర్వేలో బీజేపీకి 37, ఏఏపీకి 28 సీట్లు వస్తాయని తేలింది.












Click it and Unblock the Notifications