జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరోసారి ఆపిల్ ఐపోన్లపై ఆఫర్‌ను ప్రకటించింది. ఆపిల్‌ కంపెనీ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఐ ఫోన్‌ 10 ఎక్స్ పై రిలయన్స్ జియో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ నిలిచి ఐఫోన్‌ 10ను 70శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో కేవలం రూ. 26,7700 కే అందించనున్నట్టు తెలిపింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన నాటి నుండి ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అయితే ఈ తరుణంలో ఆపిల్ ఫోన్లపై కూడ జియో ఆఫర్ ప్రకటించింది. 70 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ జియో ప్రకటించడం గమనార్హం.

తాజాగా ఆపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 10 ఎక్స్ కోసం జనం ఎగబడుతున్నారు. ఈ తరుణంలో రిలయన్స్ ప్రకటించిన ఈ ఆఫర్‌తో ఈ మొబైల్‌ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు.అయితే ఈ ఫోన్ కొనుగోలు కోసం రిలయన్స్ జియో ప్రకటించిన క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందేందుకు కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి.

 ఐఫోన్ 10 ఎక్స్‌పై రిలయన్స్ బంపర్ ఆఫర్

ఐఫోన్ 10 ఎక్స్‌పై రిలయన్స్ బంపర్ ఆఫర్

256 జీబీ ఐ ఫోన్‌ 10 ధర రూ.30,600లకు లభ్యం కానుంది. కేవలం రిలయన్స్‌ జియో వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తింపచేయనున్నట్టు జియో వెల్లడించింది.అయితే దీనికి కొన్ని షరతులు కూడా ప్రకటించింది.ఈ షరతులకు లోబడితేనే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తోందని జియో ప్రకటించింది.ఒక సంవత్సరం తరువాత ఈ స్మార్ట్‌ఫోన్‌నుతిరిగి జియోకి అప్పగించాలి. అయితే ఫోన్‌ను రిలయన్స్ జియోకు అప్పగించే సమయంలో ఆ ఫోన్ పనిచేసే కండిషన్‌లో ఉండాలి.

రీ చార్జీ చేసుకోవాల్సిందే

రీ చార్జీ చేసుకోవాల్సిందే

ఐపోన్ 10 ఎక్స్ ఫోన్ కోసం నమోదు చేసుకున్న తేదీ నుంచి పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులు నెలకు రూ.799 చొప్పున 12 నెలలు రీచార్జ్‌ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. నెల నెల రీచార్జీ చేసుకోపోతే ఒకేసారి రూ. 9,999 వార్షిక రీఛార్జిని ఒకేసారి చేయించుకోవాలి. జియో స్టోర్‌, మై జియో యాప్‌ , రిలయన్స్‌ డిజిటల్‌, లేదా అమెజాన్‌లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

ఐపోన్ 10 (64) కోసం రూ. 89వేలు చెల్లించాలి

ఐపోన్ 10 (64) కోసం రూ. 89వేలు చెల్లించాలి

ఐ ఫోన్‌ 10(64జీబీ) కొనుగోలు సమయంలో అసలు ధర రూ. 89వేలు చెల్లించాలి. ఏడాది తరువాత పూర్తిగా కండీషన్‌లో ఉన్న ఐఫోన్‌ను తిరిగి జియోకి ఇస్తే ఆ సమయంలో​ రూ.62,300 లను జియో చెల్లిస్తుంది. ఇదే నిబంధన రూ. 1,02,000 విలువైన ఐ ఫోన్‌ 10 (256 జీబీ ధర) కూడా వర్తిస్తాయి. ఒక వేళ ఈ డివైస్‌కు పాక్షికంగా ఏదైనా డామేజ్‌ జరిగితే ఎంత చెల్లిస్తారనే విషయమై స్పష్టత ఇవ్వలేదు జియో.

ఐ ఫోన్‌పై బంఫర్ ఆపర్

ఐ ఫోన్‌పై బంఫర్ ఆపర్

గతంలో కూడ ఆపిల్ ఐఫోన్ 8 , ఐ ఫోన​ 8 ప్లస్‌ను రిలయన్స్‌ ద్వారా కొనుగోలు చేసిన జియో వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే అనే షరతుపై అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇస్తామని ప్రకటించింది. అదే తరహలో ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 10 ఎక్స్‌పై కూడ ఆఫర్‌ను ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The iPhone X is a gorgeous device that exudes premiumness thanks to its striking bezel-less design and flowing edge-to-edge OLED display. It is powered by the lightning fast A11 Bionic processor and comes with future forward AI tricks, excellent build quality and wireless charging. The problem is that all this indulgence comes at a cost - almost one lakh rupees. However, you can get your hands on the iPhone X for as low as Rs 26,700 - if you avail Reliance Jio's buyback scheme.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి