ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతల ఆందోళన!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశం వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈడీ మరో కీలక అడుగు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం,
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడి చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిన్న అర్ధరాతి పలువురు ముఖ్యనేతలు సోషల్ మీడియాలో పోస్తులు పెట్టారు. ఢిల్లీ మంత్రులతో సహా పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు బుధవారం అర్థరాత్రి సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.

నేడు ఉదయం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వారు అందులో పేర్కొన్నారు. ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంట్లో సోదాలు జరిపే అవకాశం కూడా ఉందని ఆప్ నేతలు అంటున్నారు. అయితే తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నారు. నిన్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ED విచారణకు హాజరు కావాలని కోరిన మూడవసారి సమన్లను కూడా దాటవేసారు.
రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే సన్నాహాలు, దర్యాప్తు సంస్థ యొక్క "బహిర్గతం కాని, ప్రతిస్పందన లేని విధానం" ఈడీ విచారణకు హాజరుకాకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. EDకి రాసిన లేఖలో, AAP చీఫ్ తాను ఈడీ అధికారులు పంపిన ప్రశ్నల పత్రానికి సమాధానాలు చెప్తానని, కానీ విచారణకు హాజరు కాలేనని తెలిపారు.

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎంను గతేడాది ఏప్రిల్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ముగ్గురు సీనియర్ ఆప్ నేతలు - మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌లను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. సిసోడియా, సింగ్‌లను విచారించిన రోజునే అరెస్టు చేశారు.
ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణకు ఈడీ నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3న రావాలని సమన్లు ఇచ్చినా ఈడీ ముందు విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications