ఇంటర్నెట్ వాడకంలో ఐసిస్ ఆరితేరింది: పారికర్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగంలో ప్రముఖ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆరితేరిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన డీఈఎఫ్‌సీఓఎం సెమినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.
భవిష్యత్తులో తలెత్తే యుద్ధాలన్నీ సైబర్ ప్రపంచంలోనే జరుగుతాయని మనోహర్ పారికర్ అన్నారు. సైన్యం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాబోయే కాలంలో భద్రత విషయంలో ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్‌లో కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. సైన్యంలో ఇంటర్నెట్ ఆధారిత సాంకేతికతలపై అవగాహన పెరాగాల్సిన అవసరం ఉందన్నారు.
శత్రువుల నుంచి ఎదురయ్యే సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ సంబంధాల్లో భారత్ ఆధిక్యం సాధిస్తోందని తెలిపారు.












Click it and Unblock the Notifications