ఆ న్యాయమూర్తి మృతి అంశం తీవ్రమైనది: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయ అనుమానాస్పదస్థితిలో మూడేళ్ల క్రితం మృతి చెందారు. ఈ ఆంశాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ జడ్జి మృతిని తీవ్రమైన అంశంగా పేర్కొంది.

ఈ కేసులో స్వతంత్ర విచారణ దర్యాఫ్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది.

 సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా

సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా

తన సహచరుడి కుమార్తె వివాహానికి హాజరైన బీహెచ్ లోయ 2014 డిసెంబర్ 1న నాగపూర్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ మృతి మిస్టరీగా మారింది. మిస్టరీగా మారిన ఈ కేసులో స్వతంత్ర దర్యాఫ్తు అవసరం అని చెబుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఎంఎం శాంతాగౌడర్‌తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీని విచారణ చేపట్టింది.

 బీహెచ్ లోయ మృతికి పోస్టుమార్టం నివేదిక

బీహెచ్ లోయ మృతికి పోస్టుమార్టం నివేదిక

బీహెచ్ లోయ మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదికతో పాటు సంబంధించిన పత్రాలను దాఖలు చేయాలని మహా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచనలు చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

విచారణపై ఇలా

విచారణపై ఇలా

కాగా, అంతకుముందు బాంబే లాయర్స్ అసోసియేషన్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఈ అంశం బాంబే హైకోర్టు పరిధిలో ఉన్నందువల్ల ఈ పిటిషన్‌ను విచారించకపోవడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

విచారణ జరగాలని

విచారణ జరగాలని

మహారాష్ట్రకు చెందిన పిటిషనర్లలో ఒకరైన జర్నలిస్ట్ బీఆర్ లోన్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో మరో పిటిషనర్ అయిన కాంగ్రెస్ నేత తెహసేన్ పూనావాలా తరఫున హాజరైన వీరేంద్ర కుమార్ శర్మ వాదనలు వినిపిస్తూ లాయర్ మృతి కేసులో విచారణ జరగాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+