కేఆర్ఎస్ ఖాళీ: బెంగళూరుకు తాగు నీటి కష్టాలు! (ఫోటోలు)
బెంగళూరు/మైసూరు: కృష్ఱరాజసాగర్ (కేఆర్ఎస్) రిజర్వాయర్ లో రోజురోజుకు నీటి మట్టం తగ్గిపోవడంతో మండ్య, మైసూరు జిల్లాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగర ప్రజలు ఈ సారి మాకు తాగు నీటి కష్టాలు తప్పవని అంటున్నారు.
కేఆర్ఎస్ డ్యాం నుంచి గత 20 రోజులుగా తమిళనాడుకు కావేరీ నీరు వదులుతున్నారు. గత సంవత్సరం భారీగా వర్షాలుపడటంతో అప్పుడు నీటి సమస్య రాలేదు. అయితే ఈ సంవత్సరం ఒకేఒక్క సారి వర్షం పడింది.
మండ్య, మైసూరు జిల్లాల రైతులు బతుకుపోరాటం చేస్తుంటే బెంగళూరు నగర ప్రజలు తాగునీటి కోసం పోరాటం చేస్తున్నారు. బెంగళూరు నగర ప్రజలకు తాగునీటి కొరత రానివ్వమని ప్రభుత్వం ఏవిధంగా చెబుతుందో అర్థం కావడం లేదు.

వర్షాలు లేవు
ఈ సంవత్సరం ఒకేఒక సారి వర్షం పడటంతో కేఆర్ఎస్ డ్యాంలోకి నీరు అంతగా చేరలేదు. ఇప్పుడు కేఆర్ఎస్ లో నీటి మట్టం తగ్గిపోతున్న విషయం బహిరంగంగా కనపడుతున్నది.

బెంగళూరుకు తాగునీటి కష్టాలు
బెంగళూరు నగర ప్రజలు కావేరీ నీరు తాగుతున్నారు. అయితే ప్రస్తుతం కేఆర్ఎస్ డ్యాం చూస్తే వచ్చే వేసవి నాటికి తాగు నీళ్లు ఉంటాయా ?ఉండవా ? అనే అనుమానం వస్తున్నది.

డ్యాంల నుంచి కేఆర్ఎస్ కి అక్కడి నుంచి తమిళనాడుకు
కబిని, హారంగి, హేమావతి డ్యాంల నుంచి కేఆర్ఎస్ కు నీరు వదిలి పెడుతున్నారు. ఆ డ్యాంలు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కేఆర్ఎస్ లో డెడ్ స్టోరేజ్ (74 అడుగులు) అవుతుందని తెలుస్తుంది.

కేఆర్ఎస్ కు నీరు వస్తుంటే వదిలేస్తున్నారు
కేఆర్ఎస్ డ్యాంలో 124 అడుగుల నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. మంగళవారానికి 84.10 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి. వేరే డ్యాంల నుంచి నీరు వదలడంతో కేఆర్ఎస్ లోకి 6074 క్యూసెక్కుల నీరు వచ్చింది. అదేవిధంగా కేఆర్ఎస్ నుంచి 2192 క్యూసెక్కుల నీరు బయటకు వెలుతున్నది.












Click it and Unblock the Notifications