వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రూ.2000 నోట్లు

హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నిర్వహించిన సోదాల్లో భారీగా అవకతవకలు బయటపడ్డాయి.

ఔషధాల తయారీలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), మరికొన్ని ముడి పదార్థాలను ఈ సంస్థ తయారుచేస్తుంది.

ఈ సంస్థ ఉత్పత్తుల్లో చాలావరకు అమెరికా, ఐరోపా, దుబాయి, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

ఆరు రాష్ట్రాల్లోని సంస్థకు చెందిన 50 కార్యాలయాల్లో బుధవారం ఈ దాడులు మొదలయ్యాయి.

రహస్యంగా దాచిపెట్టిన అకౌంటు పుస్తకాలతోపాటు డబ్బు కూడా సోదాల్లో బయటకు వచ్చింది. కొన్ని డిజిటల్ మీడియా ఫైళ్లు, పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డొల్ల కంపెనీలు, ఉనికిలోలేని సంస్థల నుంచి సామగ్రి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిసార్లు ధరలను కావాలనే ఎక్కువ చేసి చూపించినట్లు తేలింది. నగదు రూపంలో డబ్బులు చెల్లించి భూములు కూడా కొన్నట్లు వెలుగులోకి వచ్చింది.

కంపెనీ ఖాతాలో వ్యక్తిగత ఖర్చులను కలిపి రాయడం, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే చాలా తక్కువకే భూములు కొనుగోలు చేయడం లాంటి అవకతవకలను కూడా అధికారులు గుర్తించారు.

సోదాల్లో కొన్ని బ్యాంకు లాకర్లకు సంబంధించిన సమాచారం కూడా దొరికింది. ఈ సంస్థకు మొత్తంగా 16 బ్యాంకు లాకర్లు ఉన్నాయి. ఎలాంటి వివరాలులేని నగదే రూ.142.87 కోట్ల వరకు ఉంది. దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అకౌంటు పుస్తకాల్లో చూపని ఆదాయం రూ.550 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా లెక్కల్లో చూపని ఆదాయం ఎంత ఉంది? ఈ ఆదాయం ఎలా వచ్చింది? తదితర అంశాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
IT rides at Hetero Pharma, Rs. 142 crore cash seized - Newsreel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X