నాది కాదు: తన ఇంట్లో దొరికిన కోటిపై గిరిరాజ్ సింగ్

 It's Not Mine, Says BJP Leader About A Crore Found At His Home
పాట్నా: తన ఇంట్లో కనుగొన్న కోటి రూపాయల నగదు తనది కాదని సీనియర్ బిజెపి నేత గిరిరాజ్ సింగ్ అన్నారు. ఆ డబ్బు తన బంధువుదని చెబుతూ తనను తాను మూడో వ్యక్తిగా అభివర్ణించుకుంటూ గిరిరాజ్ సింగ్ క్లీన్, ఆ విధంగానే ఉంటాడు అని చెప్పారు.

ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన ద్వారా కూడా ఆయన వివాదాస్పదుడిగా మారారు. నరేంద్ర మోడీని విమర్శించేవాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని ఆయన చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. తాజాగా, ఆయన ఇంట్లో దొంగలు దోచుకున్న కోటి రూపాయల వ్యవహారం కూడా వివాదంగా మారింది.

ఈ వారంలో పాట్నాలోని ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. తాము కోటి రూపాయలతో పాటు 600 డాలర్ల నగదు,స ఖరీదైన చేతి గడియారాలు, ఆభరణాలు తిరిగి ఇచ్చామని పోలీసులు అంటున్నారు. అవన్నీ గిరిరాజ్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగినవేనని అన్నారు.

నగదు గురించి సింగ్‌ను అడుగుతామని పోలీసులు మంగళవారంనాడు చెప్పారు. తన వద్ద రెండు లక్షల రూపాయల నగదు మాత్రమే ఉందని ఎన్నికల సందర్భంగా సమర్పించిన పత్రాల్లో చెప్పారు. ఇంట్లో లభించిన డబ్బు గురించి చెప్పాలని ప్రతిపక్ష నేతలు గిరిరాజ్ సింగ్‌ను డిమాండ్ చేస్తున్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని గిరిరాజ్ సింగ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+