విషాదం: టీచర్ చేసిన తప్పుకు బలైన క్లాస్ టాపర్

శ్రీనగర్: ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మొహమ్మద్ అద్నన్‌ హిలాల్‌(17) కళాశాలలో నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులతో పాసయ్యేవాడు.

అయితే, గత జూన్‌లో మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు చూసుకోగా అతను ఫిజిక్స్‌లో తప్పినట్లు ఉంది. దీంతో నిస్పృహ చెందిన హిలాల్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత హిలాల్‌ మృతదేహం లభ్యమైంది.

పరీక్ష ముగిసిన అనంతరం ఇంటికి వచ్చి అంతా బాగానే రాశానని చెప్పిన హిలాల్‌ ఎలా ఫెయిల్‌ అయ్యాడా అన్న అనుమానంతో హిలాల్‌ తండ్రి గిల్కర్‌ రీవాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశాడు. ఉపాధ్యాయులు సరిగ్గా మార్కులు లెక్కించకుండా పొరపాటు చేశారని రీవాల్యుయేషన్‌లో తెలిసింది.

J&K: Four months after suicide, ‘failed’ student found to have topped class

వింతేమిటంటే హిలాల్‌ పరీక్షలో పాస్‌ అవ్వడమే గాక, ఆ సబ్జెక్ట్‌లో టాపర్‌గా నిలిచాడు. దీంతో హిలాల్‌ తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే తమ కుమారుడిని హత్య చేసిందంటూ తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు.

అయితే, ఇది పేపర్‌ దిద్దిన ఉపాధ్యాయుల తప్పేనని, కానీ ఇటువంటి ఘటనలు ఎన్నో కాలేజీల్లో జరుగుతుంటాయని అక్కడి జేకేఎస్‌బీఓటీఈ(జమ్మూ అండ్‌ కశ్మీర్‌ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) సంస్థ చెప్పడం గమనార్హం. దీనిపై గిల్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+