బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Jackpot: ఇంజనీరింగ్ విద్యార్థి, పార్ట్ టైమ్ గా క్యాసినో, రూ. 11 కోట్లు జాక్ పాట్, కట్ చేస్తే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హుబ్బళి: ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు హ్యాపీ కాలేజ్ కు వెళ్లి వస్తూ అతని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. కాలేజ్ అబ్బాయికి క్యాసినో, ఆన్ లైన్ గేమ్ లు ఆడటం అలవాటు అయ్యింది. కొన్నిసార్లు డబ్బులు పోగొట్టుకోవడం, కొన్నిసార్లు డబ్బులు గెలుచుకోవడం చేస్తున్నాడు. చిన్న వయసులోనే ఆ యువకుడు ఆన్ లైన్ గేమ్ కు అలవాటుపడ్డాడు. అయితే ఇటీవల లక్ష్మిదేవి ఆ యువకుడి ఇంటి తలుపుతట్టింది. ఆన్ లైన్ గేమ్ లో ఏకంగా రూ. 11 కోట్ల ఆ యువకుడి జోబులోకి వచ్చి పడింది. ఒక్కసారిగా అంత డబ్బులు రావడంతో స్నేహితుల కోసం, అతని సొంత ఖర్చుల కోసం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చెయ్యడం మొదలుపెట్టాడు. వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ స్నేహితులు ఆరా తీసి అసలు మ్యాటర్ తెలుసుకున్నారు. లాటరీ తగిలిన ఇంజనీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులే కిడ్నాప్ చేసి రూ. 1 కోటి ఇవ్వకుంటే మీ కొడుకును చంపేస్తామని అతని తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారు. అయితే అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

Leader: ఆంటీ మోజులో అధికార పార్టీ లీడర్, రెండో పెళ్లికి ?, రివాల్వర్ తో భార్య మీద కాల్పులు, క్లైమాక్స్ లో !Leader: ఆంటీ మోజులో అధికార పార్టీ లీడర్, రెండో పెళ్లికి ?, రివాల్వర్ తో భార్య మీద కాల్పులు, క్లైమాక్స్ లో !

 ఇంజనీరింగ్ విద్యార్థి

ఇంజనీరింగ్ విద్యార్థి

కర్ణాటకలోని హుబ్బళిలో గరీబ్ నవాజ్ ముల్లా అలియాస్ నవాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న గరీబ్ నవాజ్ ముల్లా ప్రతిరోజు హ్యాపీగా కాలేజ్ కు వెళ్లి వస్తూ అతని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. కాలేజ్ అబ్బాయి గరీబ్ నవాజ్ ముల్లాకు క్యాసినో, ఆన్ లైన్ గేమ్ లు ఆడటం అలవాటు అయ్యింది.

 లక్ష్మిదేవి తలుపు తట్టింది....... రూ. 11 కోట్లు జాక్ పాట్

లక్ష్మిదేవి తలుపు తట్టింది....... రూ. 11 కోట్లు జాక్ పాట్

గరీబ్ నవాజ్ ముల్లా కొన్నిసార్లు డబ్బులు పోగొట్టుకోవడం, కొన్నిసార్లు డబ్బులు గెలుచుకోవడం చేస్తున్నాడు. చిన్న వయసులోనే గరీబ్ నవాజ్ ముల్లా ఆన్ లైన్ గేమ్ కు అలవాటుపడ్డాడు. అయితే ఇటీవల గరీబ్ నవాజ్ ముల్లా ఇంటి తలుపు లక్ష్మిదేవి తట్టింది. ఊహించని విధంగా గరీబ్ నవాజ్ ముల్లాకు రూ. 11 కోట్ల రూపాయలు లాటరీ తగిలింది. గంటల్లోనే గరీబ్ నవాజ్ ముల్లా కోటీశ్వరుడు అయిపోయాడు.

విపరీతంగా డబ్బు ఖర్చు చేశాడు

విపరీతంగా డబ్బు ఖర్చు చేశాడు

ఆన్ లైన్ గేమ్ లో ఏకంగా రూ. 11 కోట్ల గరీబ్ నవాజ్ ముల్లా జోబులోకి వచ్చి పడింది. ఒక్కసారిగా అంత డబ్బులు రావడంతో గరీబ్ నవాజ్ ముల్లా అతని స్నేహితుల కోసం, అతని సొంత ఖర్చుల కోసం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చెయ్యడం మొదలుపెట్టాడు. లక్షలు అంటే గరీబ్ నవాజ్ ముల్లా కు లెక్కలేకుండా పోయింది.

 కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.... రూ. 1 కోటి డిమాండ్

కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.... రూ. 1 కోటి డిమాండ్

గరీబ్ నవాజ్ ముల్లాకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ అతని స్నేహితులు ఆరా తీశారు. నవాజ్ కు లాటరీ తగిలిందని అతని స్నేహితులు అసలు మ్యాటర్ తెలుసుకున్నారు. లాటరీ తగిలిన ఇంజనీరింగ్ విద్యార్థి గరీబ్ నవాజ్ ముల్లాను అతని స్నేహితులే కిడ్నాప్ చేసి రూ. 1 కోటి ఇవ్వకుంటే మీ కొడుకును చంపేస్తామని అతని తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారు.

 డీల్ కుదుర్చిన నవాజ్ తండ్రి

డీల్ కుదుర్చిన నవాజ్ తండ్రి

తన కొడుకు కనపడటం లేదని గరీబ్ నవాజ్ ముల్లా తండ్రి కేసు పెట్టారు. నవాజ్ కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఇదే సమయంలో కిడ్నాపర్లు నవాజ్ తండ్రికి పోన్ చేశారు. తాను రూ. 1 కోటి ఇవ్వలేనని నవాజ్ తండ్రి చెప్పాడు. ,చివరికి నవాజ్ తండ్రి, కిడ్నాపర్ల మద్య రూ. 15 లక్షలకు డీల్ కుదిరింది.

 దెబ్బకు సీన్ రివర్స్

దెబ్బకు సీన్ రివర్స్

హుబ్బళి-ధారవాడ జంట నగరాల కమీషనర్ లాభూరామ్ నాలుగు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి కిడ్నాపర్ల కోసం గాలించారు. గరీబ్ నవాజ్ ముల్లా తండ్రి దగ్గర రూ. 15 లక్షలు తీసుకోవడానికి వెళ్లిన కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితుడు గరీబ్ నవాజ్ ముల్లాను కిడ్నాప్ చేసిన అతని ఫ్రెండ్స్ హుబ్బళిలో నివాసం ఉంటున్న మెహమ్మద్ ఆరీఫ్, ఇమ్రాన్, అబ్దుల్ కరీమ్, హుస్సేన్ సాబ్, ఇమ్రాన్ మదర్ ఆలీ, మెహమ్మద్ రజాక్ అనే నిందితులను అరెస్టు చేశామని హుబ్బళి-ధారవాడ జంట నగరాల కమీషనర్ లాభూరామ్ మీడియాకు చెప్పారు.

English summary
Jackpot: 7 arrested for engineering student kidnap case in Hubballi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X