ప్ర‌శాంత్ కిషోర్ పాద‌యాత్ర వెన‌క జ‌గ‌న్‌? ఎన్నిక‌ల‌కు భారీ స్కెచ్‌?

రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించే ఐ ప్యాక్ సంస్థ నిర్వాహ‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ ఈ ఏడాది అక్టోబ‌రు రెండోతేదీ నుంచి జ‌న సురాజ్ పేరుతో పాద‌యాత్ర చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మూడువేల‌కిలోమీట‌ర్ల మేర సాగే ఈ యాత్ర‌లో బీహార్ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకోవ‌డంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్ర‌గామిగా నిల‌పాలంటే ఏంచేయాల‌నేదానిపై ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని పీకే చెబుతున్నారు.

 పాద‌యాత్ర ఎందుకంటే?

పాద‌యాత్ర ఎందుకంటే?

పాద‌యాత్ర చేయ‌డంవ‌ల్ల నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే అవ‌కాశం క‌లుగుతుంది. వేల కిలోమీట‌ర్లు న‌డ‌వ‌డంవ‌ల్ల వారిలో సానుభూతి క‌లుగుతుంది. ఒక‌వేళ పాద‌యాత్ర త‌ర్వాత పార్టీ పెట్టినా సానుభూతిమీద ఓట్ల వ‌ర్షం కురుస్తుంద‌నేది ఒక అంచ‌నా. అయితే పార్టీ పెడ‌తారా? లేదా? అనేది త‌ర్వాత నిర్ణ‌యించ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

 జ‌గ‌న్ స‌హ‌కారంతో?

జ‌గ‌న్ స‌హ‌కారంతో?


పీకే చేయ‌బోతున్న పాద‌యాత్ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పూర్తి స‌హాయ స‌హ‌కారాలందించ‌బోతున్నారంటూ ఆర్‌జేడీ, ఆర్ ఎల్‌డీ నేత‌లు చెబుతున్నారు. జ‌గ‌న్ స‌హ‌కారం అందించ‌డం వెన‌క కూడా ఒక భారీ ప్ర‌ణాళిక ఉంద‌ని ప‌లువురు సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఏపీలో జ‌గ‌న్ అధికారంలో కి రావ‌డంలో పీకే పాత్ర కీల‌క‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి అభిప్రాయాలు ఒకేలా ఉండ‌టంతో జ‌గ‌న్‌, పీకే మంచి స్నేహితుల‌య్యారు. ప్ర‌స్తుతానికి పీకే త‌మ పార్టీకి ప‌నిచేయ‌డంలేద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ లోపాయికారీగా ఈసారి ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డానికి ఆయ‌న బృందం ప‌నిచేస్తోంద‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు.

 ప్ర‌తి సీటూ కీల‌క‌మే!

ప్ర‌తి సీటూ కీల‌క‌మే!


2024 లోక్‌స‌భ ఎన్నిక‌లు హోరాహోరీగా జ‌రిగే అవ‌కాశం ఉంది. బీజేపీని ఎలాగైనా గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యంతో అన్ని పార్టీల‌ను ఏకం చేయాల‌ని పీకే ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అది కుద‌ర‌లేదు. ఏపీలో వైసీపీ, తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌, త‌మిళ‌నాడులో డీఎంకే, బెంగాల్‌లో తృణ‌మూల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌.. ఇలా అంద‌రినీ ఏకం చేయాల‌నేది పీకే ఆలోచ‌న‌. ఎన్నిక‌ల్లో బీజేపీకి మెజారిటీకి అవ‌స‌ర‌మైన సీట్లు రాక‌పోవ‌చ్చ‌ని, ప్రాంతీయ పార్టీల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పీకే ఆలోచ‌న‌గా ఉంది. అవ‌స‌ర‌మైతే పాద‌యాత్ర త‌ర్వాత పార్టీని ప్ర‌క‌టించి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌నీసం బీహార్‌లో 10 లోక్‌స‌భ స్థానాలైనా సాధించాల‌నేది జ‌న‌సురాజ్ ల‌క్ష్యంగా ఉంది. అనుకున్న ల‌క్ష్యాన్ని పీకే ఎంత‌మేర‌కు చేరుకుంటారో తెలియాలంటే కొంత‌కాలం వేచిచూడ‌క త‌ప్ప‌దు.!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+