వైరల్ వీడియో: బెంగళూరు జైలులో షాకింగ్.. ఫోన్ మాట్లాడుతూ, టీవీలు చూస్తున్న ఖైదీలు..!

సాధారణంగా జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కరుడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదులు, రేపిస్టులకైతే ప్రత్యేక సెల్ ఉంటుంది. వీరికి అప్పటికే కోర్టులు కఠిన కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో వీరికోసం ప్రత్యేకమైన భద్రత ఉంటుంది. అయితే తాజాగా బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు నిబంధనలకు విరుద్ధంగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది. ఖైదీల చేతిలో మొబైల్ ఫోన్ లు ఉండటంతోపాటు మరికొంతమంది ఖైదీలు టీవీ చూస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీరిలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కూడా ఉండటంతో సర్వాత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఐఎస్ఐఎస్ రిక్రూటర్ జుహాబ్ హమీద్ షకీల్ మన్నా.. జైలులోనే మొబైల్ ఫోన్ వినియోగించడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి వెళ్లడంతో ఈ విషయంపై దర్యాప్తుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జైలు సూపరింటెండ్ తో పాటు ఐదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు.

Jail or Resort Shocking Videos ISIS Terrorist Rapist Chill with Phones amp amp TV in Bengaluru Prison

ఇక నవంబర్ 8 న పోస్టు చేసిన ఈ వీడియోలో మన్నా అలియాస్ జుహాబ్ హమీద్ షకీల్ దర్జాగా ఫోన్ వాడుతున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అతడు 2018 నుంచి జైలులో ఉన్నాడు. ఇక ఇదే జైలులో వివిధ నేరాల్లో శిక్షలు పడిన ఖైదీలు, రేపిస్టులు, నేరస్థులు మొబైల్ ఫోన్ లలో మాట్లాడూతూ.. టీవీలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో బయటపడిన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఐదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+