బడ్జెట్: జైట్లీ ఆనందం... మోడీ హర్షం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ గ్రామీణ భారతంలో ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తన ముందున్న బల్లపై చేతులతో చరు
న్యూఢిల్లీ: బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న బడ్జెట్ సంప్రదాయానికి ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చరమగీతం పాడారు. 92 ఏళ్లుగా రైల్వేకు ప్రత్యేక పద్దు ప్రవేశపెడుతుండగా.. మొట్టమొదటిసారి దానిని ఈ సాధారణ బడ్జెట్ లో కలిపేశారు.
ఈ సందర్భంగా తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వే గురించి ప్రస్తావిస్తూ ''స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారి రెండూ కలిపి ( రైల్వే, సాధారణ) ఒకే బడ్జెట్ గా ప్రవేశపెట్టడం అనేది నాకు లభించిన విశేష గౌరవంగా భావిస్తున్నా..'' అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ గ్రామీణ భారతంలో ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తన ముందున్న బల్లపై చేతులతో చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.
రైతులు, గ్రామీణులకు ఉపాధి కల్పన, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుందని జైట్లీ తెలిపారు. గ్రామాల్లో నూరు శాతం విద్యుదీకరణ సాధించడంలో తమ ప్రయత్నాలు చక్కగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రుణాలకు రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications