Janmat Polls Survey: కేంద్రంలో బీజేపీ..! ఏపీలో వారే.! జన్ మత్ పోల్ తాజా సర్వే..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నారు. ఇలాంటి సమయంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇతర పార్టీల పరిస్దితి ఏంటన్న దానిపై జాతీయ స్ధాయి సంస్ధ జన్ మత్ పోల్స్ తన తాజా అంచనాలను వెల్లడించింది. ఇందులో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను విడుదల చేసింది.
జన్ మత్ పోల్స్ తాజా అంచనాల ప్రకారం లోక్ సభలో ఉన్న 543 సీట్లలో బీజేపీకి అత్యధికంగా 315 సీట్ల వరకూ రానున్నాయి. కేంద్రంలో విపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా 50 సీట్ల వరకే వస్తాయని అంచనా వేసింది. ఆ తర్వాత టీఎంసీకి 20-22 సీట్లు వస్తాయని జన్ మత్ పోల్స్ సంస్ధ తెలిపింది. ఒడిశాలో అధికార బీజేడీకి 10-11 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ కు 6-7 సీట్లు వస్తాయని తెలిపింది.

ఏపీలో అధికార వైసీపీకి ఈసారి 15-17 ఎంపీ సీట్లు రావొచ్చని జన్ మత్ పోల్స్ సంస్ధ అంచనా వేసింది. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీయే కూటమిలో పార్టీలకు అంటే టీడీపీ, బీజేపీ, జనసేనకు కలిపి 8 సీట్లు వస్తాయని తెలిపింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోందన్నది తేలిపోయింది. అయితే ఈసారి ఆయా పార్టీలకు వచ్చే సీట్ల కోసం చేసిన సర్వే పూర్తి వివరాలను మాత్రం జన్ మత్ సంస్ధ వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications